![NASA Artemis Moon Mission Launch Planned For February 2022 - Sakshi](/styles/webp/s3/article_images/2021/10/23/nasa.jpg.webp?itok=Bf28eWDm)
చంద్రుడిపై తొలి మానవసహిత యాత్రను 1959లో సెప్టెంబర్ 13న విజయవంతంగా అపోలో 11 వ్యోమనౌక ద్వారా అమెరికా ప్రయోగించిన విషయం తెలిసిందే. మరోసారి చంద్రుడిపైకి మానవులను పంపే యోచనలో నాసా ఉంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లలో నాసా నిమగ్నమైంది.
తొలి లాంచ్ ఎప్పడంటే..!
ఆర్టిమిస్ మిషన్ ద్వారా నాసా చంద్రుడిపైకి 2024లో మానవ సహిత యాత్ర చేసే యోచనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ ప్రయోగంలో భాగంగా కీలక మైలురాయి సాధించేందుకు నాసా సిద్దమైంది. ఆర్టిమెస్ మిషన్‌ను నాసా మూడు భాగాలుగా ప్రయోగించనుంది. అందులో మానవ రహిత ఆర్టిమెస్ మిషన్ -1 ప్రయోగాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో లాంచ్ చేయాలని నాసా భావిస్తోంది. ఈ మిషన్‌లో భాగంగా ఆర్టిమెస్-1 వాహన నౌకను ఈ ఏడాది చివర్లో పరీక్షించనున్నట్లు తెలుస్తోంది.
చదవండి: అదరగొట్టిన టీవీఎస్ మోటార్స్..!
లాంచ్ వెహికిల్ సిద్దం..!
ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్‌లో వెహికల్ అసెంబ్లీ ప్రాంతంలో 322 అడుగుల ఓరియన్ క్రూ క్యాప్సూల్‌ను స్పేస్ లాంచ్ వెహికిల్ సిస్టమ్‌పై బుధవారం విజయవంతంగా ఏర్పాటుచేశామని నాసా ఒక ప్రకటనలో పేర్కొంది. పలు పరీక్షల తరువాత 2022 జనవరిలో లాంచింగ్ ప్యాడ్ వద్ద తుదిపరీక్షలను నిర్వహించనుంది. అన్ని పరీక్షలు ముగిశాక ఫిబ్రవరి 12 నుంచి 27 మధ్య ఆర్టిమిస్- 1నాన్ క్రూ మిషన్‌ను చంద్రుడిపైకి ప్రయోగిస్తామని మిషన్ మేనేజర్ మైక్ సారాఫిన్ వెల్లడించారు.
చదవండి: లిప్‌స్టిక్ ఇయర్ బడ్స్‌ను చూశారా...!
Comments
Please login to add a commentAdd a comment