సెన్సెక్స్‌ 100 టూ 80,000..! | Sensex hit record high it crosses 80,000 mark and nifty cross 24,200 for the 1st time ever | Sakshi
Sakshi News home page

సెన్సెక్స్‌ 100 టూ 80,000..!

Published Wed, Jul 3 2024 10:20 AM | Last Updated on Wed, Jul 3 2024 12:35 PM

Sensex hit record high it crosses 80,000 mark and nifty cross 24,200 for the 1st time ever

భవిష్యత్తులో అంతర్జాతీయ అనిశ్చితులు రావొచ్చు. దేశాల మధ్య యుద్ధాలు జరగొచ్చు. కమోడిటీ, ఈక్విటీ మార్కెట్లు భారీ నష్టాల్లోకి వెళ్లొచ్చు. అయినా సరే అన్నింటినీ తట్టుకుని పెట్టుబడి విషయంలో క్రమశిక్షణ పాటిస్తే 20-30 ఏళ్లలో ఇన్వెస్టర్ల సంపద భారీగా పెరుగుతుందని నిపుణులు విశ్వసిస్తున్నారు. మార్కెట్‌లు గతంలోనూ చాలా అనిశ్చితులను తట్టుకుని ఇన్వెస్టర్లకు పెద్దమొత్తంలో సంపద సృష్టించాయి. ప్రస్తుతం దేశీయ స్టాక్‌ మార్కెట్లు జీవితకాల గరిష్టాలను తాకుతున్నాయి. 1979లో 100 పాయింట్లు ఉన్న సెన్సెక్స్‌ ప్రస్తుతం 80,000 మార్కు చేరింది. నిఫ్టీ 24,200 మార్కు దాటింది. ఇన్నేళ్ల చరిత్రలో మార్కెట్‌ ఎన్నో ఆటుపోట్లను తట్టుకుంది. ఆ విషయాలేంటో తెలుసుకుందాం.

100 పాయింట్లు: ఏప్రిల్‌ 3, 1979లో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 100 పాయింట్లను చేరింది.

1000 పాయింట్లు: జులై 23, 1990లో ఈ మార్కెను చేరుకుంది. 900 పాయింట్లు పెరగడానికి అప్పట్లో దాదాపు 11 ఏళ్లు పట్టింది.

5000 పాయింట్లు: సెన్సెక్స్‌ 1000 పాయింట్లు చేరుకున్నాక దేశీయంగా చాలా పరిణామాలు చోటుచేసుకున్నాయి.

  • జనవరి 17, 1991లో గల్ఫ్‌యుద్ధం మొదలైంది.

  • జులై 24న మన్మోహన్‌ సింగ్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కీలక మార్పులు తీసుకొచ్చారు.

  • ఏప్రిల్‌ 26, 1992లో హర్షద్‌మెహతా కుంబకోణం సంచలనం సృష్టించింది. 

  • జనవరి 01, 1993 నుంచి భారత్‌లోకి ఎఫ్‌ఐఐల రాకమొదలైంది. 

  • అక్టోబర్‌ 28, 1997లో ఏషియన్‌ మార్కెట్‌లు కుప్పకూలాయి. 

  • మే 1,1998లో భారత్‌ న్యూక్లియర్‌ పరీక్షలు నిర్వహించింది. 

  • అక్టోబర్‌ 05, 1998లో యూఎస్‌లో ఆర్థిక అనిశ్చితుల కారణంగో భారత్‌లోని సెన్సెక్స్‌ ఓకేరోజు 7 శాతం కుంగింది.

  • మే26, 1999లో పాకిస్థాన్‌పై భారత్‌ కార్గిల్‌ యుద్ధం ప్రకటించింది.

  • డిసెంబర్‌ 30, 1999లో సెన్సెక్స్‌ 5000 మార్కును తాకింది.

10000 పాయింట్లు

  • ఏప్రిల్‌ 13, 2000లో టెక్‌ కంపెనీలు భారీగా నష్టపోయాయి.

  • మార్చి 30, 2001లో కేతన్‌ప్రకాశ్‌ స్కామ్‌ వెలుగులోకి వచ్చింది.

  • జులై 2, 2001లో ‘బద్లా ట్రేడింగ్‌’ను రద్దు చేశారు.

  • ఫిబ్రవరి 7, 2002లో ఎఫ్‌​ఐఐలకు డెరివేటివ్‌ ట్రేడింగ్‌లోకి అనుమతులు ఇస్తూ ప్రకటనలు జారీ చేశారు.

  • ఫిబ్రవరి 6, 2006లో 10000 మార్కెను చేరింది.

25000 పాయింట్లు

  • ఏప్రిల్‌ 26, 2007లో ఐపీఓ స్కామ్‌ వెలుగులోకి వచ్చింది.

  • అక్టోబర్‌ 17,2007లో సెబీ ఎఫ్‌ఐఐల ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీలో 50 శాతం ఉండేలా పార్టిసిపేటరీ నోట్‌ పద్ధతిలో మార్పులు తీసుకొచ్చింది.

  • జనవరి 21, 2008 అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది.

  • మే 16, 2014లో సెన్సెక్స్‌ 25000 మార్కును తాకింది.

50000 పాయింట్లు

  • మే 26, 2014లో నరేంద్రమోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.

  • నవంబర్‌ 9, 2016లో రూ.500, రూ.1000 పెద్దనోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

  • జులై 1, 2017లో జీఎస్టీను అమలులోకి తీసుకొచ్చారు.

  • సెప్టెంబర్‌ 14, 2018లో ఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ స్కామ్‌ వెలుగులోకి వచ్చింది.

  • మార్చి 24, 2020లో కొవిడ్‌ వైరస్‌ కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించారు.

  • జనవరి 21, 2021లో సెన్సెక్స్‌ 50000 మార్కును చేరింది.

75000 పాయింట్లు

  • జనవరి 24, 2023లో అదానీ గ్రూప్‌ సంస్థలపై హిండెన్‌బర్గ్‌ ఇచ్చిన నివేదికతో మార్కెట్‌లు కొంత రెడ్‌లో ముగిశాయి.

  • నవంబర్‌ 29, 2023లో భారత్‌ కంపెనీలు 4 ట్రిలియన్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌కు చేరాయి.

  • ఏప్రిల్‌ 9, 2024లో సెన్సెక్స్‌ చివరకు 75000 మార్కును కూడా విజయవంతంగా చేరుకుంది.

ఇదీ చదవండి: ఐటీఆర్‌ ఫైలింగ్‌లో ద్రవ్యోల్బణాన్ని లెక్కిస్తున్నారా..?

80,039 పాయింట్లు

మే 2024, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భారతప్రధాని నరేంద్రమోదీ, అమిత్‌ షా ఈక్విటీ మార్కెట్లను ఉద్దేశించి దేశ ఆర్థిక వ్యవస్థపై సానుకూలంగా స్పందించారు. ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడి పెడితే రానున్న రోజుల్లో స్పష్టమైన ప్రభుత్వం ఏర్పడి ఇన్వెస్టర్ల సంపద మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ఎన్నికల ఫలితాల తర్వాత బుల్‌ ర్యాలీ కొనసాగుతోంది. దాంతో మార్కెట్‌లు కొత్త గరిష్ఠాలను చేరుతున్నాయి. జులై 03, 2024న సెన్సెక్స్‌ 80,039 మార్కును తాకింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement