దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం భారీగా పుంజుకున్నాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 688 పాయింట్లు పెరిగి 22,573 వద్దకు చేరింది. సెన్సెక్స్ 2156 పాయింట్లు ఎగబాకి 74,235 వద్ద ముగిసింది.
సెన్సెక్స్ 30 సూచీలో అత్యధికంగా ఇండస్‌ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, ఎం అండ్ ఎం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌యూఎల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, సన్‌ఫార్మా, ఏషియన్ పెయింట్స్, మారుతీ సుజుకీ, విప్రో, ఐటీసీ, హెసీఎల్ టెక్నాలజీస్, నెస్లే, టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఇన్ఫోసిస్, ఎన్‌టీపీసీ, టైటాన్ స్టాక్‌లు పెరిగాయి.
ఎన్‌డీఏ కూటమి కేంద్రంలో మరోసారి అధికారం చేపట్టనుందని స్పష్టమవడంతో ఈరోజు మార్కెట్లు భారీగా పెరిగాయి. జూన్ 8వ తేదీన సాయంత్రం దిల్లీలోని కర్తవ్యపథ్‌లో మోదీ ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఫలితాలవేళ తీవ్ర ఒడిదొడుకులకు లోనైన మార్కెట్లు ఎలాగైనా ఎన్‌డీఏ కూటమి అధికారంలోకి వస్తుందనే స్పష్టమైన నిర్ణయంతో ఈరోజు సూచీలు భారీగా పుంజుకున్నట్లు తెలుస్తుంది.
మార్కెట్‌లో కొత్తగా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నవారు కంగారుపడకుండా మార్కెట్ సరళిని అవకాశంగా చూడాలని నిపుణులు చెబుతున్నారు. ఫండమెంటల్స్ బలంగా ఉన్న స్టాక్స్‌లో పెట్టుబడిపెట్టిన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు. మార్కెట్ పడిపోతున్న సమయంలో మరిన్ని స్టాక్‌లు కొనుగోలు చేయాలంటున్నారు. మంచి కంపెనీల్లో పెట్టుబడి పెట్టినవారు కొంతసమయం వేచిచూస్తే లాభాలు పొందవచ్చని చెబుతున్నారు.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment