దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం లాభాలతో దూసుకుపోతున్నాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 231 పాయింట్లు పెరిగి 22,850 వద్దకు చేరింది. సెన్సెక్స్ 785 పాయింట్లు ఎగబాకి 75,168 వద్ద ముగిసింది. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో భారీగా పడిపోయిన మార్కెట్లు వరుసగా రెండో రోజు పుంజుకున్నాయి.
సెన్సెక్స్ 30 సూచీలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, ఎస్‌బీఐ, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఎల్ అండ్ టీ, ఎన్‌టీపీసీ, విప్రో, భారతీ ఎయిర్‌టెల్, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, మారుతీసుజుకీ, టాటా మోటార్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఐటీసీ, కొటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, పవర్‌గ్రిడ్ కంపెనీ స్టాక్‌లు లాభాల్లోకి చేరుకున్నాయి.
హెచ్‌యూఎల్, ఏషియన్ పెయింట్స్, నెస్లే, ఎం అండ్ ఎం, ఇండస్ ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, సన్ ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్, ఆల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ షేర్లు నష్టాల్లోకి చేరుకున్నాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment