స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు | Stock Market Rally On Today Closing | Sakshi
Sakshi News home page

స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

Published Wed, Jun 19 2024 3:31 PM | Last Updated on Wed, Jun 19 2024 3:31 PM

Stock Market Rally On Today Closing

దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 36 పాయింట్లు నష్టపోయి 23,521 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 49 పాయింట్లు దిగజారి 77,337 వద్ద ముగిసింది.

సెన్సెక్స్‌ 30 సూచీలో యాక్సిస్‌బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, ఇన్ఫోసిస్‌, విప్రో, టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ కంపెనీ స్టాక్‌లు లాభాల్లోకి చేరుకున్నాయి.

టైటాన్‌, ఎల్‌ అండ్‌ టీ, భారతీ ఎయిర్‌టెల్‌, మారుతీ సుజుకీ, ఎన్‌టీపీసీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, పవర్‌గ్రిడ్‌, ఐటీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హెచ్‌యూఎల్‌, సన్‌ఫార్మా, ఎం అండ్‌ ఎం, ఏషియన్‌ పెయింట్స్‌, నెస్లే, టాటా మోటార్స్‌ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement