దేశీయ స్టాక్ మార్కెట్‌లు ఈరోజు స్వల్ప లాభాలతో ముగిశాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల నిర్ణయంతో పాటు మే నెల సీపీఐ ఆధారిత ద్రవ్యోల్బణ డేటా కోసం ఇన్వెస్టర్లు ఎదురుచూడడంతో భారత ఈక్విటీ మార్కెట్లు బుధవారం స్వల్ప శ్రేణిలోనే కొనసాగాయి.
ఈరోజు బీఎస్ఈ సెన్సెక్స్ 150 పాయింట్లు లేదా 0.2 శాతం పెరిగి 76,607 వద్ద ముగిసింది. నిఫ్టీ 50.58 పాయింట్లు లేదా 0.25 శాతం పెరిగి 23,323 వద్ద ముగియగా అంతకు ముందు 23,442 పాయింట్ల రికార్ట్ హైని తాకింది.
కోల్ ఇండియా, పవర్ గ్రిడ్, ఐషర్ మోటార్స్, ఎస్‌బీఐ లైఫ్, టెక్ మహీంద్రా, ఎల్టీఐ మైండ్ ట్రీ, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్, బీపీసీఎల్ షేర్లు 1 శాతానికి పైగా లాభపడ్డాయి. బ్రిటానియా ఇండస్ట్రీస్, ఎంఅండ్ఎం, హెచ్ యూఎల్, టైటాన్, టాటా కన్జూమర్, అదానీ పోర్ట్స్, యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లో ముగిశాయి.
Comments
Please login to add a commentAdd a comment