దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:18 సమయానికి నిఫ్టీ 51 పాయింట్లు లాభపడి 23,316కు చేరింది. సెన్సెక్స్ 166 పాయింట్లు ఎగబాకి 76,628 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్ 105.27 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 81.93 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.4 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.27 శాతం, నాస్‌డాక్ 0.88 శాతం లాభాల్లోకి చేరాయి.
భారత్ వేగంగా వృద్ధి చెందే ఎకానమీగా కొనసాగుతుందని ప్రపంచ బ్యాంక్ నివేదికలో పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సహా వచ్చే మూడేళ్ల పాటు నిలకడగా 6.7 శాతం వృద్ధి నమోదు చేయగలదని తెలిపింది. పెట్టుబడుల వృద్ధి కాస్త నెమ్మదించినా గతంలో అంచనా వేసిన దానికన్నా పటిష్టంగానే ఉండొచ్చని ప్రపంచ బ్యాంకు తెలిపింది.
కొత్త కనిష్టానికి రూపాయి
దేశీయ కరెన్సీ రూపాయి విలువ అమెరికా డాలరుతో పోలిస్తే కొత్త కనిష్టానికి చేరింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 9 పైసలు నష్టపోయి 83.59 వద్ద ముగిసింది. 83.49 వద్ద ప్రారంభమైన రూపాయి ఇంట్రాడేలో 83.59కు చేరింది.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment