నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్‌మార్కెట్లు | Stock Market Rally On Today Opening | Sakshi
Sakshi News home page

నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్‌మార్కెట్లు

Published Fri, Jun 14 2024 9:32 AM | Last Updated on Fri, Jun 14 2024 9:32 AM

Stock Market Rally On Today Opening

దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు శుక్రవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:30 సమయానికి నిఫ్టీ 44 పాయింట్లు నష్టపోయి 23,351కు చేరింది. సెన్సెక్స్‌ 197 పాయింట్లు దిగజారి 76,609 వద్ద ట్రేడవుతోంది.

అమెరికా డాలర్‌ ఇండెక్స్‌ 105.26 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 81.99 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.24 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాలతో ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీ 0.23 శాతం, నాస్‌డాక్‌ 0.34 శాతం  లాభాల్లోకి చేరాయి.

ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే బీఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ క్యాప్‌(విలువ) మరోసారి కొత్త రికార్డును సృష్టించింది. గత రెండు రోజుల్లో రూ.4.72 లక్షల కోట్లు జమకావడంతో రూ.431.67 లక్షల కోట్లను(5.17 ట్రిలియన్‌ డాలర్లు) అధిగమించింది. గురువారం ఇంట్రాడేసహా ముగింపులోనూ చరిత్రాత్మక గరిష్టాలను అందుకున్నాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్‌ 77,145 పాయింట్లను అధిగమించగా.. నిఫ్టీ 23,481కు చేరింది. రిటైల్‌ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) తగ్గడంతో ఆర్‌బీఐ వడ్డీ రేట్ల తగ్గింపునకు మొగ్గు చూపవచ్చన్న అంచనాలు మార్కెట్లు పెరిగేలా చేశాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement