దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు శుక్రవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:23 సమయానికి నిఫ్టీ 27 పాయింట్లు లాభపడి 22,597కు చేరింది. సెన్సెక్స్ 85 పాయింట్లు దిగజారి 74,423 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్ 105.6 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 89.22 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.7 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో నష్టాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.46 శాతం నష్టపోయింది. నాస్‌డాక్ 0.64 శాతం దిగజారింది. త్రైమాసిక ఫలితాలు విడుదల తర్వాత మైక్రోసాఫ్ట్ స్టాక్ 4 శాతం, గూగుల్ స్టాక్ 12 శాతం పెరిగింది.
కొత్త వినియోగదారులను ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా చేర్చుకోకుండా ఆర్‌బీఐ ఆంక్షలు విధించడంతో కోటక్ మహీంద్రా బ్యాంక్ షేరు నిన్న 10.85% కుదేలై రూ.1643 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ షేరు రూ.1620 వద్ద 52 వారాల కనిష్ఠాన్ని తాకింది. సంస్థ మార్కెట్ విలువ రూ.39,768.36 కోట్లు పతనమై రూ.3.26 లక్షల కోట్లకు పరిమితమైంది. దీంతో మార్కెట్ విలువ పరంగా అత్యంత విలువైన బ్యాంక్‌ల్లో 5వ స్థానానికి పడిపోయింది.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment