అభివృద్ధే అజెండా | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధే అజెండా

Published Sat, Sep 7 2024 2:52 AM | Last Updated on Sat, Sep 7 2024 2:52 AM

అభివృ

చిత్తూరు కార్పొరేషన్‌: పార్టీకతీతంగా అభివృద్ధే ధ్యేయంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని జెడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక జెడ్పీ తొలి సర్వ సభ్య సమావేశం శుక్రవారం జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించారు. అధ్యక్షత వహించి చైర్మన్‌ మాట్లాడారు. ప్రజాప్రతినిధులు ప్రస్తావించిన సమస్యలను అధికారులు ప్రాధాన్యత వారీగా పరిష్కరించాలని ఆదేశించారు.

ఇసుక దుమారం

గృహ నిర్మాణ శాఖ అంశంపై జరిగిన చర్చలో వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీలు ఉదయ్‌కుమార్‌, రామచంద్రారెడ్డి మాట్లాడారు. ఇసుక సరఫరాలో తలెత్తుతున్న ఇబ్బందులతో ప్రజలు అవస్థలు పడుతున్నారని, అంతేకాకుండా గృహ నిర్మాణాలు ఆశించిన స్థాయిలో జరగడం లేదన్నారు. దీనిపై చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్‌ విభేదించారు. దీంతో జెడ్పీటీసీలు, ఆ ఎమ్మెల్యేల నడుమ వాగ్యుద్ధానికి దారితీసింది.

మదనపల్లెలో టమాట మోసం

మదనపల్లె టమాట మార్కెట్‌లో జాక్‌పాట్‌ పేరిట వ్యాపారులు రైతులను దోచుకుంటున్నా వారిపై చర్యలు తీసుకోకుండా అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారని జెడ్పీటీసీ ఉదయ్‌ ధ్వజమెత్తారు. 35 కేజీలు టమాటాలు తీసుకొని 30 కేజీలకు మాత్రమే డబ్బులు ఇస్తున్నారని, ఇకనైనా వ్యాపారులపై చర్యలు తీసుకోవాలన్నారు.

పరిశ్రమల హబ్‌ ప్లీజ్‌: జీడీ నెల్లూరు ఎమ్మెల్యే

పూతలపట్టు, చిత్తూరు, జీడీనెల్లూరు నియోజకవర్గాల మధ్య పరిశ్రమల హబ్‌ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే థామస్‌ కోరారు. తిరుపతిలో హౌసింగ్‌ కాలనీల్లో ఇళ్లు పొందిన లబ్ధిదారుల వివరాలు ఇవ్వాలని తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసులు కోరారు.

ఫ్రీ హోల్డ్‌ విధానం పెట్టండి

కూటమి ప్రభుత్వం వచ్చాక ఫ్రీ హోల్డ్‌ విధానం ఆపివేసిందని, దీనిని తిరిగి ప్రవేశపెట్టేలా చర్యలు తీసుకోవాలని శ్రీకాళహస్తి జెడ్పీటీసీ వెంకటసుబ్బారెడ్డి కోరారు.

సగం అంశాలపై మాత్రమే చర్చ

సమస్యలను ప్రాధాన్యత వారీగా పరిష్కరిస్తామని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ గాంధీ తెలిపారు. సమావేశంలో వ్యవసాయ, విద్య, వైద్య, గ్రామీణ నీటి సరఫరా, గృహ నిర్మాణ, విద్యుత్‌, పంచాయతీరాజ్‌, జిల్లా గ్రామీణభివృద్ధి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, సీ్త్ర మరియు శిశు సంక్షేమం.. పరంగా మొత్తం 10 అంశాలను అజెండాలో పెట్టారు. కానీ మొదటి 5 అంశాలపై అధికారులు ప్రగతి నివేదించి, మిగిలిన వాటిపై చర్చించకనే సమావేశం ముగించారు. సీఈఓ గ్లోరియా, ఎమ్మెల్సీ భరత్‌, జేసీ విద్యాధరి, మదనపల్లె సబ్‌కలెక్టర్‌ మేఘ స్వరూప్‌, జెడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ రమ్య, సహాయ కలెక్టర్‌ హిమవంశీ, తిరుపతి డీఆర్‌ఓ పెంచలకిషోర్‌, జెడ్పీటీసీలు, మూడు జిల్లాల అధికారులు పాల్గొన్నారు.

‘రైతు భరోసా’ ఎందుకివ్వరు?

వ్యవసాయ రంగంలో పెట్టుబడి అందక రైతులు ఇబ్బందులు ‘రైతు భరోసా’ ఇప్పటికీ ఎందుకు ఇవ్వలేదని రామసముద్రం జెడ్పీటీసీ రామచంద్రారెడ్డి దుయ్యబట్టారు. వ్యవసాయాన్ని పండుగ చేయకపోయినా ఫర్వాలేదు కానీ కనీస అవసరాలు తీర్చకపోతే రైతు బతికేది ఎలా? అని నిలదీశారు.

మాట్లాడుతున్న జెడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు, చిత్రంలో కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌, సీఈఓ గ్లోరియా, పాల్గొన్న ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు

డీఈఓల గైర్హాజరుపై ఎమ్మెల్సీ పర్వతనేని ఆగ్రహం

మూడు జిల్లాలకు సంబంధించి సమావేశానికి చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల డీఈఓలు రాకపోవడంపై ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతనేని చంద్రశేఖర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్క్‌ అడ్జస్ట్‌మెంట్‌లో భాగంగా నిర్వహించిన కౌన్సెలింగ్‌లో టీచర్ల నుంచి వచ్చిన సమస్యలను పరిష్కరించకుండా సర్దుబాటు పూర్తి చేయడం సరికాదని ఆక్షేపించారు. అంతేకాకుండా స్టూడెంట్స్‌ నమోదు డేటాను తప్పుగా చూపి వర్క్‌ అడ్జస్ట్‌మెంట్‌లో అధికారులు కొందరికి మేలు కలిగేలా చక్రం తిప్పారని ఆరోపించారు.

జెడ్పీ సర్వ సభ్య సమావేశంలో చైర్మన్‌ శ్రీనివాసులు

ఇసుకపై ప్రజాప్రతినిధుల వాగ్వాదం

నిలదీసిన తిరుపతి ఎంపీ గురుమూర్తి

తిరుపతి జిల్లాలో చేస్తున్న క్యాన్సర్‌ స్క్రీనింగ్‌పై వైద్య ఆరోగ్య శాఖ అధికారులను తిరుపతి ఎంపీ గురుమూర్తి నిలదీశారు. వైద్య ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం 77,717 మందికి క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ చేయగా, 190 మందికి నిర్ధారణ అయినట్లు నివేదికలో ఇచ్చారన్నారు. వాస్తవానికి గత ప్రభుత్వ పాలనలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దేశంలోనే మొట్ట మొదటగా తిరుపతి జిల్లాలో రెండు ‘పింక్‌ బస్సుల్లో’ క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేయించి, వైద్య పరీక్షలు నిర్వహిస్తూ స్విమ్స్‌తో అనుసంధానం చేశారన్నారు. 19 ప్రైమరీ హెల్త్‌ సెంటర్ల పరిధిలో 2,70,234 మంది ఉండగా ఎంఎల్‌హెచ్‌పీల ద్వారా 1,76,776 మందిని సర్వే చేసి, వీరిలో 78,847 మందికి పాజిటివ్‌ లక్షణాలు ఉన్నట్లు గుర్తించారన్నారు. నిర్ధారణ పరీక్షల కోసం ‘పింక్‌ బస్సు’లో పరీక్షించుకున్న 8053లో 929 మందికి క్యాన్సర్‌ ఉందని నిర్ధారణైందన్నారు. అయితే ‘పింక్‌ బస్సు’ వద్దకు నిర్ధారణ పరీక్షలకు రావలసిన వారు ఇంకనూ70 వేల మంది ఉన్నారన్నారు. వీరందరికీ నిర్ధారణ పరీక్షలు చేస్తే ఎంతమంది వ్యాధి బారిన పడ్డారో తెలుస్తుందని, ప్రస్తుతం క్యాన్సర్‌తో 250 మంది చికిత్స పొందుతున్నారన్నారు. ప్రాథమిక దశలో నిర్ధారణ చేస్తే వ్యాధి నివారణకు అవకాశం ఉంటుందని, అధికారుల నడుమ సమన్వయం కొరవడి సరైన డేటాని నిక్షిప్తం చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
అభివృద్ధే అజెండా1
1/3

అభివృద్ధే అజెండా

అభివృద్ధే అజెండా2
2/3

అభివృద్ధే అజెండా

అభివృద్ధే అజెండా3
3/3

అభివృద్ధే అజెండా

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement