ఈ రాశివారికి పనులలో విజయం, శుభవార్తలు అందుతాయి! | daily horoscope 7th september 2024 in telugu | Sakshi
Sakshi News home page

ఈ రాశివారికి పనులలో విజయం, శుభవార్తలు అందుతాయి!

Published Sat, Sep 7 2024 6:51 AM | Last Updated on Sat, Sep 7 2024 11:04 AM

daily horoscope 7th september 2024 in telugu

శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, తిథి: శు.చవితి ప.1.54 వరకు, తదుపరి పంచమి, నక్షత్రం: చిత్త ఉ.10.31 వరకు, తదుపరి స్వాతి, వర్జ్యం: సా.4.41 నుండి 6.25 వరకు, దుర్ముహూర్తం: ఉ.5.40 నుండి 7.26 వరకు, అమృతఘడియలు: రా.3.07 నుండి 4.51 వరకు, వినాయక చవితి; రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు, యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు, సూర్యోదయం: 5.49, సూర్యాస్తమయం: 6.08. 

మేషం... కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. సన్నిహితుల నుంచి సహాయం. వాహనయోగం. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత.

వృషభం... పాతమిత్రుల కలయిక. ఇంటర్వ్యూలు అందుతాయి. ఆసక్తికరమైన సమాచారం. ఆలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

మిథునం... కుటుంబంలో చికాకులు. బంధువుల నుంచి ఒత్తిడులు. అనుకోని ప్రయాణాలు. ఖర్చులు. ఉద్యోగ, వ్యాపారాలలో మార్పులు ఉండవచ్చు.

కర్కాటకం... వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. దూరప్రయాణాలు. అనుకోని ధనవ్యయం. ఉద్యోగులకు పనిభారం. వ్యాపారాలు మందగిస్తాయి. సోదరుల కలయిక.

సింహం... పనులు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం. ఇంటర్వ్యూలు అందుతాయి. ఉద్యోగులకు ముఖ్య విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు లాభిస్తాయి.

కన్య... రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో స్వల్ప వివాదాలు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. ఆరోగ్యభంగం.

తుల..... ఉద్యోగులకు కొత్త ఆశలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. బంధువుల కలయిక. విందువినోదాలు. ఆకస్మిక ధన,వస్తులాభాలు.

వృశ్చికం...దూరప్రయాణాలు. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగులకు గందరగోళం. దైవదర్శనాలు.

ధనుస్సు.. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ఆర్థిక ప్రగతి. చేపట్టిన కార్యక్రమాలు సాఫీగా పూర్తి. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు పదోన్నతులు.

మకరం.... పనులలో విజయం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

కుంభం... దూరప్రయాణాలు. రుణయత్నాలు. పనులలో జాప్యం. బంధువులు, మిత్రులతో స్వల్ప వివాదాలు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలలో చికాకులు.

మీనం... ప్రయాణాలు వాయిదా. శ్రమా«ధిక్యం. పనులు మందగిస్తాయి. బంధువుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు సామాన్యమే. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement