కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. విద్యుత్‌ లైటింగ్‌, దేవతామూర్తుల విద్యుత్‌ లైట్ల రూపాలతో ఆలయ పరిసరాలు సరికొత్త శోభను సంతరించుకున్నాయి. చూ | - | Sakshi
Sakshi News home page

కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. విద్యుత్‌ లైటింగ్‌, దేవతామూర్తుల విద్యుత్‌ లైట్ల రూపాలతో ఆలయ పరిసరాలు సరికొత్త శోభను సంతరించుకున్నాయి. చూ

Published Sat, Sep 7 2024 2:52 AM | Last Updated on Sat, Sep 7 2024 2:52 AM

కాణిప

విద్యుత్‌ కటౌట్లు, దీపాలంకరణలు ..పుష్కరిణి నీటిలో కనిపిస్తున్న ప్రతిబింబాలు

కాణిపాకం: కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంలో శనివారం నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈనెల 27వ తేదీ వరకు వీటిని నిర్వహించనున్నారు. గత నెల ఉత్సవ తేదీ ఖరారు చేసినప్పటి నుంచి ఏర్పాట్లలో అధికారులు తలమునకలై పనులు పూర్తి చేశారు. ఆలయంతోపాటు రథం, వాహనాలకు రంగులు వేయించడంతో ఉత్సవ కళతో ఉట్టిపడుతున్నాయి. అలాగే అక్కడక్కడా పెయింటింగ్‌తో వేసిన రంగవల్లులు మహిళా భక్తులను ఆకర్షిస్తున్నాయి. అవసరమైన చోట మరమ్మతులు పూర్తి చేశారు. ఇటు చిత్తూరు నుంచి..అటు తిరుపతి మార్గం నుంచి స్వాగతం పలుకుతూ రోడ్డుకు ఇరువైపులా స్వాగతం కటౌట్లు కట్టారు.

● ఆలయ ఆవరణంతా విద్యుత్‌ దీపాలంకరణతో ముస్తాబు చేశారు. ప్రధాన ఆలయ గోపురం నుంచి చుట్టుపక్కల ప్రాంతాలకు చేసిన దీపాలంకరణ సరికొత్త కాంతులీనుతోంది. దీంతో పాటు మూషిక, అన్వేటి, సుపథ మండపాలు, నవగ్రహ ఆలయం, అభయాంజనేయస్వామి ఆలయాన్ని కూడా మనోహరంగా అలంకరించారు. దేవతామూర్తుల విద్యుత్‌ కటౌట్లు ఈ పర్యాయం మరింత ఆకర్షణీయంగా ఉన్నాయి.ఈ అలంకరణలతో ఎటుచూసినా కాణిపాకంలో ‘చవితి’ శోభ ఆధ్యాత్మిక సౌరభాన్ని వెదజల్లుతోంది. అలాగే వివిధ రకాల పుష్పాలంకరణతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయ ముఖద్వారం నుంచి ధ్వజస్తంభం, ఆలయ లోపలి భాగం మొత్తం పలు రకాల పుష్పాలతో అలంకరించారు.

● ఆలయ ఆవరణలో హోమ, యజ్ఞ పూజలు సైతం నిర్వహించేందుకు ప్రత్యేక షెడ్డు ఏర్పాటు చేశారు. వాహనాలకు మూడు చోట్ల పార్కింగ్‌ స్థలం కేటాయించారు. గణేష్‌ సేవా సదన్‌ భవనం ఆనుకుని ఉన్న ఖాళీ స్థలంలో బస్సులు, పెద్ద పెద్ద వాహనాలు, బస్టాండు ఆనుకుని ఉన్న స్థలంలో ఆటోలు, కార్ల పార్కింగ్‌ కోసం ఏర్పాటు చేశారు. ఇవి రెండు నిండుకుంటే..అతిథి గృహం వెనుక భాగంలో మరో పార్కింగ్‌ స్థలానికి వాహనాలను కేటాయించేలా ముందస్తు ఏర్పాట్లు చేశారు. అన్నదానం, నిత్య ప్రసాదం వితరణ, తాగునీరు అందించనున్నారు.

లడ్డుపోటును

పరిశీలిస్తున్న

ఈఓ

పుష్పాలంకరణ చేస్తున్న

కార్మికులు

ఇక భక్తులకు ఇబ్బందులు లేకుండా..

బ్రహోత్సవ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు పూర్తి స్థాయిలో నిఘా పెట్టారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. బందోబస్తుకు పోలీసులను నియమించారు. అలాగే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు వివిధ శాఖల అధికారులను కలెక్టర్‌, ఎస్పీ నియమించారు. ఈఓ గురుప్రసాద్‌ ఏర్పాట్లను శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. తరువాత లడ్డుపోటు, అన్నదానం, కల్యాణకట్టను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు.

నేటి నుంచి శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థాన బ్రహ్మోత్సవాలు

సర్వాంగ సుందరంగా ఆలయం

ఆకట్టుకుంటున్న పుష్పాలంకరణ

విద్యుత్‌ అలంకరణ, దేవతామూర్తుల కటౌట్లతో సరికొత్త శోభ

భక్తులకు సౌకర్యార్థం మూడు

ప్రాంతాల్లో పార్కింగ్‌ కల్పన

No comments yet. Be the first to comment!
Add a comment
కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మో1
1/2

కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మో

కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మో2
2/2

కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మో

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement