టీడీపీ నాయకులు రవి, శివ కలిసి మా ఇంటి స్థలాన్ని ఆక్రమించారు. ఆ స్థలంలో పునాదులు వేయడానికి గుంతలు తవ్వుతుండగా నేను వెళ్లి అడిగాను. వెంటనే శివ భార్య, అమ్మ ఇద్దరూ కలిసి తీవ్రంగా కొట్టారు. చెవి తెగిపోయి రెండు కుట్లు పడ్డాయి. నా చేయిపై శివ కర్రతో కొట్టాడు. ‘‘మీకు దిక్కున్న చోట చెప్పుకోండి, మొన్నంతా ఏదో పీకాలని తహసీల్దార్ వద్దకు వెళ్లారు కదా ఎవరైనా వచ్చారా.’’ అంటూ కొట్ట్టారు. మేము ఆక్రమించేదే ఎవరొస్తారో చూస్తాం అంటూ బెదిరించారు. ఇక ఊరొదిలి వెళ్లిపోవాల్సిందే!
– శాతాజ్, బాధితురాలు
Comments
Please login to add a commentAdd a comment