జగనన్న మనిషి విజయ్
భూమనతో పార్టీకి పూర్వ వైభవం
పోరాట నాయకుడు భూమన కరుణాకరరెడ్డి పార్టీకి పూర్వవైభవం తెస్తారనే నమ్మకం ఉందని చిత్తూరు నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి విజయానందరెడ్డి ధీమావ్యక్తం చేశారు. అందరిలో మనోధైర్యం నింపి కార్యకర్తల నిస్తేజం పోవడానికి ఆయనకు అధిష్టానం బాధ్యతలు అప్పగించిందన్నారు. ఆయన్ను చూసి ఎంతో స్ఫూర్తి పొందానని చెప్పారు. గత ఎన్నికల్లో ఏమి అన్యాయం జరిగిందో తెలియదు కానీ ఓడిపోయామన్నారు. దళిత, మైనారిటీ వర్గాలకు జగనన్న డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చారని గుర్తుచేశారు. అమలుకానీ హామీలిచ్చి కూటమి ప్రభుత్వం గద్దెనెక్కిందన్నారు. వాటి అమలుకోసం పోరాటాలు చేద్దామన్నారు. కార్యకర్తలకు కష్టం వస్తే అందరం స్పందిస్తామని హామీ ఇచ్చారు. డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్, నాయకులు, ప్రజాప్రతినిధులు పురుషోత్తంరెడ్డి, జ్ఞానజగదీష్, టిమ్ము, గాయత్రీదేవి, రాహుల్‌రెడ్డి, సూర్యప్రతాప్‌రెడ్డి, లీనారెడ్డి, కేపీశ్రీధర్, ఆను, ప్రసాద్‌రెడ్డి, బాబునాయుడు, మధుసూదన్‌రాయ ల్, ప్రకాష్, రజనీ, అమర్‌నాథరెడ్డి, హరిణిరెడ్డి, భాగ్యలక్ష్మి, అంజలిరెడ్డి, సంపత్, సరళామేరీ పాల్గొన్నారు.
● కార్యకర్తలకు అండగా ఉంటాం
● కూటమి వాగ్దానాల అమలుకు పోరాడదాం
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
భూమన కరుణాకరరెడ్డి
చిత్తూరు కార్పొరేషన్: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మనిషి విజయ్ (విజయానందరెడ్డి) నాయకత్వంలో నియోజకవర్గ శ్రేణులు ముందుకు వెళ్లాలని చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. స్థానిక పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన చిత్తూరు నియోజకవర్గ పార్టీ సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వాన్ని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని చెప్పారు. అదే వైఎస్ జగన్, కుటుంబంపై పోస్టులు పెట్టినవారిని ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. తిరగబడితే తొక్కిపడేస్తామని పోలీసుల ద్వారా ప్రభుత్వం సంకేతం ఇస్తోందని వివరించారు. జగన్ పేదల వైపు ఉంటే చంద్రబాబు బడాబాబుల వైపు ఉంటారని చెప్పారు. మనం కష్ట సమయంలో ఉన్నాం ఇప్పుడు పోరాడే వీరులుగా అందరూ సిద్ధమవుదామన్నారు. కూటమి పాలనపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని ఆ ఆలోచనలను ఒకటిగా చేసి ఏకతాటిపై తెద్దామని చెప్పారు. కార్యకర్తలకు ఎలాంటి అవసరం వచ్చినా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పార్టీకి 11 నియోజకవర్గాల్లో పూర్వవైభవం తీసుకువస్తానని పేర్కొన్నారు. చిత్తూరు తనకు కొత్తకాదని 1974లోనే ఇక్కడ ఉద్యమాలు చేశానని గుర్తు చేశారు. జిల్లాపై సమగ్ర అవగాహన ఉందని అందరినీ కలుపుకొని పనిచేస్తానన్నారు. చిత్తూరువాసులకు విజయానందరెడ్డి ఎన్నో సేవలు చేశారన్నారు.
బడ్జెట్‌లో హామీల ప్రస్తావనేదీ?
బడ్జెట్‌లో సూపర్ సిక్స్ హామీల ప్రస్తావన లేదని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి దుయ్యబట్టారు. సోషల్ మీడియా పోస్టులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అధికారం తాత్కా లికమే.. కానీ ఖాకీలు పదవీ విరమణ అయ్యేవరకు డ్యూ టీ చేయాలన్న విషయం గుర్తు పెట్టుకోవాలని చెప్పారు. చిత్తూరులో విజయానందరెడ్డి, తిరుపతిలో కరుణాకరరెడ్డి ఓటమి ఊహించలేదన్నారు. పథకాల ద్వారా రాష్ట్ర ప్రజలకు రూ.3.5 లక్షల కోట్లు జగనన్న అందజేశారన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఘోరాలు చూసి డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ హోంమంత్రిని విమర్శించిన తీరు వారి చేతకాని పాలనకు అద్దం పడుతోందన్నారు. చేతకాని చంద్రబాబును సమర్థవంతుడిగా ఎల్లోమీడియా చూపిస్తోందని దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment