ఇక సమస్యలపై దృష్టి సారించండి | - | Sakshi
Sakshi News home page

ఇక సమస్యలపై దృష్టి సారించండి

Published Wed, Nov 13 2024 12:19 AM | Last Updated on Wed, Nov 13 2024 12:19 AM

ఇక సమస్యలపై దృష్టి సారించండి

ఇక సమస్యలపై దృష్టి సారించండి

పలమనేరు: ఇన్నాళ్లూ ఎన్నికలు ఆపై కొత్త ప్రభుత్వం ఏర్పాటు, అధికారుల బదిలీలతో ఇబ్బందులున్నందున, ఇకపై రెవెన్యూ సమస్యలపై తహసీల్దార్లు దృష్టి సారించాలని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ సూచించారు. ఆ మేరకు పలమనేరు, కుప్పం రెవెన్యూ డివిజన్లలోని ఆర్‌డీవోలు, తహసీల్దార్లు, డీటీలతో స్థానిక ఆర్‌డీవో కార్యాలయంలో సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. మాట్లాడుతూ రీసర్వేలో తలెత్తిన ఇబ్బందులను, ఆర్‌డీవో కార్యాలయాల్లో పెండింగ్‌ ఫిర్యాదులను వారానికి పది చొప్పున పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా కోర్టు కేసుల విషయంలో ఆలస్యం చేయరాదన్నారు. ఇటీవల జరిగిన రెవెన్యూ గ్రామ సభల్లో వచ్చిన ఎల్‌పీఎం ఫిర్యాదుల పరిష్కారానికి మూడునెలల షెడ్యూల్‌ తయారు చేసినట్లు వివరించారు. ఈ సమావేశంలో పలమనేరు, కుప్పం ఆర్‌డీవోలు భవాణి, మోహన్‌కుమార్‌, డీఎస్‌వో శంకర్‌, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement