తవణంపల్లె మహిళా సమాఖ్యకు జాతీయస్థాయి పురస్కారం
తవణంపల్లె: తవణంపల్లె మండల మహిళా సమాఖ్యకు జాతీయస్థాయి ప్రశంస దక్కింది. మండల మహిళా సమాఖ్య సభ్యులు రైతు ఉత్పత్తిదారుల సమాఖ్య ద్వారా రైతులకు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఆ సమాఖ్యకు జాతీయ స్థాయిలో ద్వితీ య స్థానం దక్కింది. ఈ నేపథ్యంలో శుక్రవారం హైదరాబాద్‌లో యూసుఫ్‌గూడలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్‌లో ఆ సమాఖ్య సభ్యులు సర్టిఫికెట్, షీల్డు, ప్రోత్సాహక నగదు రూ.75 వేలు అందుకున్నారు. ఈ బహుమతులను వారికి ఏపీ ఆంధ్రప్రదేశ్ మహిళా అభివృద్ధి సొసైటీ(మాస్) సీఈఓ సీఎస్ రెడ్డి, వైస్ చైర్‌పర్సన్ మహాపరఆలీ, జర్మనీకి చెందిన సహకార సంస్థ ప్రతినిధి కొర్బేనియస్, ఎస్‌బీఐ తెలంగాణ సీజేఎం రాజేష్‌కుమార్, శాప్ సంస్థ ఎండీ పాల్‌థామస్, అభివృద్ధి రంగ నిపుణురాలు సుధాకొఠారి తదితరులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాస్ సభ్యులు డబ్ల్యూఆర్ రెడ్డి, మోహనయ్య, తవణంపల్లె మహిళా సమాఖ్య అధ్యక్షురాలు రేఖ, కార్యదర్శి అనిత, ఏపీఎం, సీసీ, అకౌంటెంట్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment