మాయ బేరం | - | Sakshi
Sakshi News home page

మాయ బేరం

Published Tue, Nov 26 2024 2:03 AM | Last Updated on Tue, Nov 26 2024 2:03 AM

మాయ బేరం

మాయ బేరం

మద్యం..

చిత్తూరు నుంచే..?

ఈ కొత్త ఐడియా చిత్తూరు కేంద్రంగా మొదలు పెట్టాలని నిర్ణయించారు. ఇందు కోసం మద్యం బార్‌ కలిగివున్న టీడీపీకి చెందిన ఓ నాయకుడు ముందు నిలబడ్డాడు. జిల్లా కేంద్రంలో తనకు అనుకూలంగా ఉన్న పలువురు బార్‌ యజమానులను కలుపుకున్నాడు. జిల్లా మొత్తంగా పది బార్లు ఉంటే.. ఒక్క చిత్తూరులోనే ఏడు బార్లు ఉన్నాయి. తొలుత చిత్తూరు నగరంలో మద్యం దుకాణాలను తమకు అప్పగించి వ్యాపారానికి సహకరిస్తే.. మిగిలిన చోట్ల కూడా ఇదే పాలసీను అమలు చేస్తామని చిత్తూరులోని పలువురు ఎకై ్సజ్‌ అధికారులను కలిసి తమ కోరికను బయటపెట్టారు. అధికారులు ఊరికే ఈ పని చేయొద్దని, ఒక్కో మద్యం దుకాణానికి నెలకు రూ.2 లక్షల మామూళ్లు చొప్పున.. రూ.3.12 కోట్ల మామూళ్లు ముట్టజెబుతామని బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారు.

మద్యం దుకాణాలపై బార్‌ నిర్వాహకుల కన్ను నెలకు రూ.3 లక్షల లాభం.. లైసెన్సు ఫీజుపై హామీ

పరిమిత గంటల విక్రయాలు.. ఆపై దుకాణం మూత మద్యం ప్రియులను బార్‌కు రప్పించి.. దందా చేద్దాం

పైలెట్‌ ప్రాజెక్టుగా చిత్తూరు.. పాసైతే జిల్లా మొత్తం జిల్లాలో ఎకై ్సజ్‌ అధికారుల వద్దకు చేరిన పంచాయితీ

చిత్తూరు అర్బన్‌: అధికారాన్ని అడ్డుపెట్టుకుని జిల్లాలో కూ టమి నేతలు ఆడుతున్న ఆటలు చూస్తుంటే మతిపోతోంది. ఆవురావురుమంటూ ఆకలితో ఉన్నాం.. కనిపించిందంతా మింగేస్తాం అన్నట్టు అడుగులు వేస్తున్నారు. జిల్లాలో మ ద్యం బార్‌ నిర్వాహకులు సరికొత్త ప్రణాళిక రచించారు. మద్యం దుకాణాలన్నీ మింగేసి, మందుబాబులను తమ బార్‌ గుమ్మం తొక్కేలా కిక్కిచ్చే ఐడియాను రూపొందించా రు. దుకాణాలకు తమకు అప్పగించాల్సిందేనంటూ జిల్లా లోని ఓ ఎకై ్సజ్‌ అధికారి వద్ద పంచాయితీ పెట్టారు.

దోపిడీ ఐడియా ఇదే..

ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మంజూరు చేసిన మద్యం దుకాణాల లైసెన్సుల్లో 20 శాతం లాభాలు ఇస్తామని చె ప్పడంతో దరఖాస్తుల రూపంలోనే ప్రభుత్వానికి రూ.45.32 కోట్ల ఆదాయం లభించింది. ఇక జిల్లాలో నిర్ణయించిన 104 మద్యం దుకాణాలకు లైసెన్సులు మంజూరు చేశారు. అయితే మద్యం కొనుక్కున్న తరువాత దాన్ని తాగడానికి పర్మిట్‌ గదులకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. దీంతో లైసెన్సు తీసుకున్న వ్యాపారులు ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు అనధికారిక మినీ బార్లను తలపించే పర్మిట్‌ గదులను ఏర్పాటు చేసుకున్నారు. పర్మిట్‌ గ దులు ఇష్టానుసారం ఏర్పాటు చేసుకోవడంతో, మద్యం బార్ల యజమానుల కడుపు మండిపోయింది. ఒక్కో దుకా ణ నిర్వాహకుడికి 20 శాతం లాభాలు ఇవ్వడంతోపాటు ఇలా పర్మిట్‌ గదులు నడిపితే బార్లు మూసుకోవాల్సిందే నని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏటా రూ.60 లక్షల వ రకు లైసెన్సు ఫీజులు చెల్లించి, భవనం, సర్వీస్‌, విద్యుత్‌ బిల్లులు, పన్నులు అన్నీపోయి తమకు 2 శాతం లాభాలు మాత్రమే వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చి త్తూరులో లైసెన్సులు దక్కించుకున్న వారి నుంచి మద్యం షాపులు తాము లీజుకు తీసుకోవాలని, ఇందుకోసం నెల కు రూ.3 లక్షలు చెల్లించడంతోపాటు, పూర్తి లైసెన్సు ఫీజు లు తామే చెల్లిస్తామనే ప్రతిపాదన తీసుకొచ్చారు. ఉద యం 2 గంటలు, సాయంత్రం రెండు గంటలు మాత్రమే మద్యం షాపులను తెరిచి ఉంచి, ఆపై మూసేయాలని, త ద్వారా మందు బాబులంతా బార్లకు వస్తే ఇక్కడ ఎమ్మార్పీ అనే నిబంధన లేకపోవడంతో ఇష్టం వచ్చిన ధరలకు మద్యం విక్రయించవచ్చని ఐడియా రూపొందించారు.

కృత్రిమ కొరత ఖాయం

కొందరు బార్‌ యజమానులు తీసుకొచ్చిన ఈ కక్కుర్తి ఐ డియాతో టీడీపీ నేతలు స్వలాభం పొందడం ఖాయంగా కనిపిస్తోంది. కానీ ప్రభుత్వ ఖజానాకు మాత్రం భారీగా గండిపడే అవకాశాలున్నాయి. దీని ప్రకారం రోజుకు 4 గంటలు మాత్రమే దుకాణాలను తెరిచి ఉంచడంతో బ్లాకులో మద్యం విక్రయాలు పెరగడం, కృత్రిమ కొరత ఏర్పడం జ రుగుతుంది. ఇక మద్యం బార్లలో కళ్లెం వేయని ధరలు.. మద్యం ప్రియులను సారా, కర్ణాటక మద్యం వైపు నడిపిస్తుంది. పూర్తిగా వ్యవస్థనే నాశనం చేయడానికి తమ్ముళ్లు పన్నిన ఈ కుట్రపై అధికారులు ఎలా ముందుకు వెళుతారనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

ఓ ఐడియా.. అక్రమ వ్యాపారానికి తెరలేపనుంది.. మద్యం ప్రియులకు ‘ధరా’ఘాతం కానుంది.. ఈ ఆలోచన ఆచరణలోకి వస్తే ప్రభుత్వ ఖజానాకు గండి ఖాయం కానుంది.. బ్లాక్‌ మార్కెట్‌కు అడుగు పడనుంది.. కూటమి నేతలు సాక్షాత్తు ఓ ఎకై ్సజ్‌ అధికారి వద్దే పంచాయితీకి శ్రీకారం చుట్టారు.

ఆలోచనలో పడిన అధికారులు..

నెలకు రూ.3 కోట్లకు పైగా మామూళ్లంటే ఆషామాషీ కాదు. గత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ప్రభుత్వ మద్యం దుకాణాలు రావడంతో ఎమ్మార్పీ ఉల్లంఘనకు అవకాశం లేకుండాపోయింది. నాన్‌ డ్యూటీ పెయిడ్‌ మ ద్యాన్ని నివారించడం, సారాపై ఉక్కుపాదం మోపడం కోసం సెబ్‌ను ఏర్పాటు చేయడంతో ఎకై ్సజ్‌శాఖలోని కొందరు అవినీతి అధికారుల కోరలు చచ్చుబడిపోయాయి. తాజాగా కూటమి ప్రభుత్వం ప్రైవేటు మద్యం దుకాణాలు తీసుకురావడం, సెబ్‌ను తీసేయడంతో భారీ ఆకలితో ఉన్న ఎకై ్సజ్‌లోని తిమింగలాలకు మళ్లీ ప్రాణం పోసినట్లయ్యింది. మద్యం బార్‌ యజమానులు తీసుకొచ్చిన సరికొత్త ప్రతిపాదన భలే ఉందని మురిసిపోతున్నారు. కానీ ఈ ప్రతిపాదన ప్రభుత్వ పెద్దల దృష్టికి వెళితే ఎలా అని ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. తమకు వచ్చే వాటాలను మళ్లీ రాజకీయ నేతలకు పంచడం ఇష్టం లేదని కొందరు అధికారులు బాహాటంగానే పెదవి విరుస్తున్నారు. మరి ఈ ఐడియా ఉపద్రవం తెస్తుందో..? భారీ ద్రవ్యం తీసుకొస్తుందో..? వేచి చూడాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement