సాయిబుల కుంట ఆక్రమణ
గంగవరం: మండలంలోని మేలమాయి రెవె న్యూ పరిధిలో సాయిబుల కుంట ఆక్రమణకు గురైంది. పలమనేరు– మదనపల్లె జాతీయ రహదారిలోని అప్పినపల్లి క్రాస్ సమీపంలోని సాయిబులు కుంట సర్వే నంబర్ 685లో 1.66 ఎకరాల విస్తీర్ణం ఉంది. ప్రస్తుతం కుంట పరి స్థితి చూస్తే ఎకరా కూడా లేకపోవడం గమనార్హం. చాలా ఏళ్లుగా ఈ కుంట ఆక్రమణలో ఉ న్నట్టు పలువురు ఆరోపించారు. కుంట పక్కన భూములున్న వారు కుంట స్థలాన్ని ఆక్రమించుకుని సరిహద్దులుగా రాతి బండలు నా టారు. అంతే కాకుండా కుంట సమీపంలోని ఇటుకల బట్టీ నిర్వాహకుడు కుంటను కొద్దికొద్దిగా జేసీబీతో తవ్వి, తన అధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే కుంట సరిహద్దు, కట్టను తొలగించి ఆక్రమిత స్థ లంలో దుకాణ రూములు నిర్మించి, బాడుగకు ఇచ్చుకున్నాడు. ఇంత జరుగుతున్నా ఏ రోజూ రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో ఈ విషయమై స్థానికులు తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా స్పందన లేద న్న ఆరోపణలున్నాయి. ఇకనైనా స్పందించి ఆక్రమణకు గురైన కుంటను తిరిగి ప్రభుత్వ అధీనంలోకి తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
నల్లబ్యాడ్జీలతో
108 ఉద్యోగుల నిరసన
చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లా వ్యాప్తంగా సోమవారం 108 ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. సమ్మె సైరన్ మో గించి, తమ సమస్యలను పరిష్కరించాలని డి మాండ్ చేశారు. జీతాలు సకాలంలో ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, షిఫ్ట్ ప్రాతిపదికన డ్యూటీ లు వేయాలని, ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరారు. జిల్లా నుంచి 20 మంది ఉద్యోగులు విజయవాడకు బయలు దేరారు. రాత్రికి ప్రభుత్వం పిలిచి, సమస్యల ను పరిష్కరిస్తుందని ఎదురుచూస్తున్నారు. అలా ప్రభుత్వం పిలుపు నివ్వకపోతే, సమ్మె మరింత బలపడుతుందని 108 వాహన ఉద్యోగులు చెబుతున్నారు.
డీపీఓ ఆకస్మిక తనిఖీ
గంగాధర నెల్లూరు: మండల పరిషత్ కార్యాలయాన్ని డీపీఓ సుధాకర్‌రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. గంగాధర నెల్లూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ ఆధ్వర్యంలో జరుగుచున్న స్వర్ణ పంచాయతీ డేటాను ఆన్‌లైన్‌లో ఎలా అప్‌లోడ్ చేస్తున్నారు.. ఒకొక్క డేటా ఎంట్రీకి ఎంత సమయం పడుతుందన్న విషయం పరిశీలించారు. అనంతరం మండలంలోని పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లతో సమావేశం నిర్వహించి, స్వర్ణ పంచాయతీ డేటాను తప్పులు లేకుండా, సక్రమంగా, త్వరితగతిన ఆన్‌లైన్‌లో ఎలా అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. ఎంపీడీఓ హరిప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment