పది పరీక్షల వేళ నేర్వని పాఠం | - | Sakshi
Sakshi News home page

పది పరీక్షల వేళ నేర్వని పాఠం

Published Thu, Jan 9 2025 3:02 AM | Last Updated on Thu, Jan 9 2025 3:02 AM

పది ప

పది పరీక్షల వేళ నేర్వని పాఠం

● టీచర్ల బదిలీలు, ఉద్యోగోన్నతులకు సమాచార నిధి సేకరణ ● వివరాలు నమోదు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు ● సెలవుల్లో ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వాలంటున్న ఉపాధ్యాయులు ● పాఠ్యప్రణాళికలను పక్కదారి పట్టించేలా చేస్తున్నారని ఆగ్రహం ● వివరాల నమోదులో సర్వర్‌ సమస్యలు ● తలలు పట్టుకుంటున్న గురువులు

19,320 మంది టీచర్ల వివరాలు నమోదు చేయాల్సిందే

చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న 19,320 మంది ఉపాధ్యాయుల వివరాలు తప్పక నమోదు చేయాల్సి ఉంటుంది. ఇందుకు వారం రోజులు గడువు విధించారు. వారం రోజుల్లోపు వివరాలన్ని నమోదు చేయాలంటే సాధ్య పడదని టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతి తక్కువ సమయంలో వివరాల నమోదులో తప్పిదాలు చోటు చేసుకుంటే సమస్యలు ఎదురవుతాయని టీచర్లు వెల్లడిస్తున్నారు.

కూటమి పాలనలో వింత పోకడలు

చిత్తూరు కలెక్టరేట్‌:చిత్తూరు జిల్లాలో 2,499, తిరు పతి జిల్లాలో 3,063 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. చిత్తూరు జిల్లాలో 9,162 మంది, తిరుపతి జిల్లాలో 10,158 మంది టీచర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ పాఠశాలల్లోని ఉపాధ్యాయుల బదిలీలు.. పదోన్నతుల వంటివి పారదర్శకంగా నిర్వ హించేందుకు టిస్‌ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ కసరత్తులో ప్రతి ఉపాధ్యాయుని వ్యక్తిగత, వృత్తిపరమైన వివరాలను టీచర్‌ ఇన్‌ఫర్మేషన్‌ సిస్టం(టిస్‌)లో నమోదు చేయాలని అధికారులు ఆదేశిస్తున్నారు.

తలలు పట్టుకుంటున్న ఉపాధ్యాయులు

వేసవి సెలవుల్లో నిర్వహించాల్సిన కసరత్తులను విద్యాసంవత్సరం జరిగే సమయంలో చేపట్టడంపై ఉపాధ్యాయులు గుర్రుమంటున్నారు. పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు మూడు నెలల సమయం మాత్రమే ఉండడంతో పాఠ్యాంశాల పునశ్చరణ, వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని వెల్లడిస్తున్నారు. అలాగే మిగిలిన తరగతులు సిలబస్‌ను పూర్తి చేయాల్సి ఉంటుందంటున్నారు. ఇలాంటి సమయంలో టిస్‌ వివరాల నమోదుకు ప్రత్యేక సమయం కేటాయించాల్సి ఉంటుందన్నారు. వివరాలు నమోదు చేసేందుకు చాలా సమయం పడుతుందని చెబుతున్నారు. టిస్‌లో వివరాల నమోదుపై ఎలాంటి అవగాహన కల్పించకుండానే వెంటనే చేయాలని ఉత్తర్వులివ్వడం సరైన పద్ధతి కాదని చెబుతున్నారు. వివరాల నమోదుకు సంబంధించి వివరాలు ఎలా నమోదు చేయాలోనని టీచర్లు తలలు పట్టుకుంటున్నారు.

ప్రతి అంశం నమోదు చేయాల్సిందే

టిస్‌ కసరత్తులో ప్రతీ టీచర్‌ తన వ్యక్తిగత వివరాల్లో పుట్టిన ఊరు, తేదీ, తల్లిదండ్రులు, పిల్లల వివరాలు నమోదు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఏ డీఎస్సీ ద్వారా ఉద్యోగం వచ్చింది? ఏ సబ్జెక్టులో ఎంపికయ్యారు? ఎప్పుడు చేరారు? విద్యార్హతలు.. పదోన్నతులు ఏ కేటగిరీ నుంచి పొందారు? ఇప్పటివరకు ఎక్కడెక్కడ పని చేశారు? వచ్చిన అవార్డులు, రివార్డుల వివరాలతోపాటు రిజర్వేషన్‌ ఉంటే అవీ నమోదు చేయాలి. దివ్యాంగులైతే సర్టిఫికెట్‌ స్కాన్‌ చేసి జతపరచాలి. అవివాహితులైతే ఆ వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలి. అనారోగ్య సమస్యలున్నా తెలియజేసి, వైద్యుల నివేదికలను సమర్పించాలి. ఉపాధ్యాయులు ఇచ్చిన సమాచారాన్ని ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖాధికారులు ధ్రువీకరించాలి. ఎవరైనా తప్పుడు సమాచారం ఇస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. విద్యాశాఖ. ఎన్‌సీఈఆర్టీ నిర్వహించిన శిక్షణకు హాజరైతే ఆ వివరాలు పేర్కొనాలి.

టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యాశాఖలో వింత పోకడలు అమలవుతున్నాయని విద్యావేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో విద్యాభివృద్ధికి సంబంధించి ఇచ్చిన హమీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సీఎస్‌ఈ వెబ్‌సైట్‌లో టిస్‌ అనే యాప్‌లోకి వెళ్లి టీచర్ల వ్యక్తిగత, వృత్తిపరమైన సమాచారం అప్లోడ్‌ చేయాలని సూచించారు. ఇందుకు సంబంధించి గత ఏడాది డిసెంబర్‌ 23వ తేదీ సాయంత్రం వివరాల నమోదుకు మాడ్యూల్స్‌ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆన్‌లైన్‌లో టిస్‌ వివరాల నమోదులో సర్వర్‌ సమస్యలు తలెత్తుతున్నాయి. ఫొటో అప్‌లోడ్‌ వద్ద మరొకరి ఫొటో అప్‌లోడ్‌ అవ్వడం, వివరాలు సరిగ్గా నమోదు కాకపోవడం జరుగుతోంది. వివరాల నమోదు కోసం టీచర్లు పనివేళలు మానుకుని విద్యాశాఖ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడింది.

ఇలాంటి సమయంలో కరెక్టు కాదు

ఇలాంటి సమయంలో టిస్‌ కార్యక్రమాలు నిర్వహించడం కరెక్టు కాదు. పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు పటిష్ట ప్రణాళికలు అమలు చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో టిస్‌ కసరత్తు నిర్వహించడం సరైన పద్ధతి కాదు. అతి తక్కువ సమయం ఇచ్చి వివరాలు వెంటనే నమోదు చేయాలంటే ఎలా చేస్తారు. తప్పులు చేస్తే చర్యలు తీసుకుంటామంటారు. టీచర్లనే బాధ్యులు చేస్తారు. సెలవు రోజుల్లో ఇలాంటి కసరత్తులు చేపడితే పారదర్శకంగా ఉంటుంది. – బాలాజీ, ఆపస్‌ సంఘం రాష్ట్ర అధ్యక్షులు

సెలవుల్లో నిర్వహించాలి

టిస్‌ కార్యక్రమాన్ని సెలవుల్లో నిర్వహించాలి. వివరాలు నమోదు చేసేందుకు సమయం ఎక్కువగా పడుతుంది. టెక్నాలజీపై పట్టు లేని వారు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. టిస్‌ కార్యక్రమంలో ప్రతి అంశాన్ని పకడ్బందీగా నమోదు చేయాల్సిందే. ఇలాంటి తరుణంలో సమయం ఎక్కువగా ఉంటే పారదర్శకంగా వివరాలను నమోదు చేసేందుకు అవకాశం ఉంటుంది.

– వినాయకం, ఎస్సీ,ఎస్టీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు

No comments yet. Be the first to comment!
Add a comment
పది పరీక్షల వేళ నేర్వని పాఠం 
1
1/2

పది పరీక్షల వేళ నేర్వని పాఠం

పది పరీక్షల వేళ నేర్వని పాఠం 
2
2/2

పది పరీక్షల వేళ నేర్వని పాఠం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement