తీవ్ర కరువుమండలంగా గుడిపాల
● కేంద్ర కరువు నిర్ధారణ కమిటీ సభ్యుడు ప్రదీప్‌కుమార్
గుడిపాల: రైతులతో మాట్లాడిన తరువాత గుడిపాలను తీవ్ర కరువు మండలంగా గుర్తించామని కేంద్ర కరువు నిర్ధారణ కమిటీ సభ్యులు ప్రదీప్‌కుమార్ తెలిపారు. బుధవారం 190 రామాపురంలో 2024 ఖరీఫ్‌లో వేరుశనగ పంట సాగు చేసిన రైతుల పొలాలను కేంద్ర కరువు నిర్ధారణ కమిటీ సభ్యుడు ప్రదీప్‌కుమార్ సందర్శించారు. అనంతరం వారు రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులు ఆయనతో మాట్లాడుతూ వర్షాలు లేకపోవడంతో వేరుశనగ పంట పూర్తిగా దెబ్బతినిందని, దీంతో ప్రస్తుతం ప్రత్యామ్నాయంగా ఉలవ పంట సాగు చేశామని తెలిపారు. సుమారు 10 మంది రైతుల పొలాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు వేరుశనగ పంటతో చాలా నష్టపోయారన్నారు. పొలాలను సందర్శిస్తే చాలా విషయాలు తెలిశాయని చెప్పారు. ప్రత్యామ్నాయ మార్గాల వైపు రైతులు వెళ్లాలన్నారు. ఉద్యానవనశాఖతో సమన్వయం చేసుకుని భూసార పరీక్షల అనంతరం అనువైన వర్షాధార పంటలు సాగు చేసుకోవాలని సూచించారు. అనంతరం కొంతమంది రైతులు తమ సమస్యలపై ఆయనకు అర్జీలు అందజేశారు. తరువాత వేరుశనగ పంట నష్టం ఫొటో ప్రదర్శనను తిలకించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ డీఎం అండ్ ఎఫ్‌డబ్ల్యూ దీపాంకర్‌సేత్, లైవ్‌స్టాక్ హెల్త్ అసిస్టెంట్ కమిషనర్ మన్నుజీ ఉపాధ్యాయ్, జిల్లా వ్యవశాయాధికారి మురళీకృష్ణ, సిరికల్చర్ జాయింట్ డైరెక్టర్ శోభారాణి, వెటర్నరీ డీడీ ప్రభాకర్, ఆర్డీఓ శ్రీనివాసులు, జిల్లా గ్రౌడ్‌వాటర్ అధికారి గోవర్ధన్‌రెడ్డి, డీఈలు ప్రసాద్, రవికుమార్, తహసీల్దార్ చంద్రశేఖర్‌రెడ్డి, ఎంపీడీఓ శివరాజన్, వ్యవసాయాధికారి మాధవి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment