పట్టపగలే నడిరోడ్డుపై దారుణ హత్య | Gang Chased Attacked Man With Sharp Weapons Tamil Nadu | Sakshi
Sakshi News home page

యువకుడిని వెంబడించి హతమార్చిన గ్యాంగ్‌

Published Thu, Sep 24 2020 7:37 PM | Last Updated on Thu, Sep 24 2020 8:44 PM

Gang Chased Attacked Man With Sharp Weapons Tamil Nadu - Sakshi

మృతుడు గోకుల్‌(ఫైల్‌ ఫొటో: కర్టెసీ ఇండియా టుడే)

చెన్నై: తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. పట్టపగలే దుండగులు ఓ యువకుడిపై పాశవికంగా దాడి చేశారు. పదునైన ఆయుధాలతో తీవ్రంగా గాయపరిచి హతమార్చారు. వివరాలు.. గోకుల్‌(28) అనే యువకుడు బుధవారం రాణిపేట్‌లోని ఆరక్కణం కొత్త బస్టాండుకు వెళ్లాడు. ఇంతలో అక్కడికి చేరుకున్న నలుగురు వ్యక్తులు అతడిపై దాడికి దిగారు. దీంతో భయంతో పరుగులు తీస్తున్న గోకుల్‌ను వెంబడించి మరీ హతమార్చారు. (చదవండి: పట్ట పగలు మంత్రి ‘పిఏ’ కిడ్నాప్‌....!)

రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న గోకుల్‌ మరణించాడని నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ఇక ఈ ఘటనతో ఒక్కసారిగా స్థానికంగా కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు గోకుల్‌ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వీడియోల ఆధారంగా హంతకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా గోకుల్‌ హత్య వెనుకగల కారణాలు ఇంతవరకు వెల్లడికాలేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement