నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక | - | Sakshi
Sakshi News home page

నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

Published Mon, Sep 9 2024 1:38 AM | Last Updated on Mon, Sep 9 2024 1:38 AM

నేడు ప్రజా సమస్యల  పరిష్కార వేదిక

అమలాపురం రూరల్‌: ప్రజా సమస్యల పరిష్కార వేదికను సోమవారం అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్‌ గోదావరి భవన్‌లో ఉదయం 10 గంటల నుంచి నిర్వహిస్తామని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఫిర్యాదుదారులు తమ సమస్యలను జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం పొందాలని అన్నారు.

ట్రాన్స్‌కోపై టీడీపీ నేత ఒత్తిడి

నిబంధనలకు విరుద్ధంగా

ట్రాన్స్‌ఫార్మర్‌ ఇవ్వాలని పట్టు

అమలాపురం టౌన్‌: అమలాపురం వేంకటేశ్వరస్వామి దేవస్థానానికి సమీపంలో ఓ టీడీపీ నాయకుడు అపార్ట్‌మెంట్‌ నిర్మించారు. దీనికి నిబంధనలకు విరుద్ధంగా అదీ ఉచితంగా తనకు ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేయాలని ట్రాన్స్‌కో అధికారులపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నాడు. అదే పార్టీ ఓ కీలక ప్రజాప్రతినిధికి అనుచరుడిగా... ఆయన పేరుతో, అండతో అధికారులకు హుకుం జారీ చేస్తున్నాడు. ఆ నాయకుడొక అపార్ట్‌మెంట్‌ను కొత్తగా నిర్మించాడు. సాధారణంగా ఓ మిల్లు లేదా ఏదైనా మినీ పరిశ్రమ, అపార్ట్‌మెంట్లు, పెద్ద గ్రూపు హౌస్‌లు నిర్మించుకుంటే రెండు, అంతకు మించి విద్యుత్‌ కనెక్షన్లు అవసరమైతే అక్కడ వాటి యజమానే సొంత ఖర్చుతో ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేయించుకోవాలనేది నిబంధన. ఈ నాయకుడు తాను నిర్మించిన అపార్ట్‌మెంట్‌లోని ప్లాట్‌లు, పెంట్‌ హౌస్‌తో కలిపి మొత్తం 8 విద్యుత్‌ కనెక్షన్లు పొందాల్సి ఉంది. అపార్ట్‌మెంట్‌ వద్ద 40 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌ సొంతంగా ఏర్పాటు చేసుకోవాలి. ఇందుకు రూ.5 లక్షల వరకూ ఖర్చవుతుంది. అయితే అధికార పార్టీ గర్వం, ఓ కీలక ప్రజాప్రతినిధి అండతో ఆ నాయకుడు ట్రాన్స్‌కో అధికారులపై వారం రోజులుగా తీవ్ర ఒత్తిడి తెస్తున్నాడు. నిబంధనలు ఒప్పుకోవవి అధికారులు చెబుతున్నా, ససేమిరా అంటున్నారు. పైగా మీ సంగతేంటో తేల్చుతానని హెచ్చరికలు చేసి అధికారులను బెదిరిస్తున్నాడు. స్థానికంగా ఈ అంశం చర్చనీయాంశమైంది.

కోనసీమ డీసీసీ

అధ్యక్షునిగా కొండేటి

మామిడికుదురు: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా నగరం గ్రామానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబును నియమించారు. దీనికి సంబంధించి ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌ ఆదేశాలు జారీ చేశారు.

సొంతూరిలో

‘ఆయ్‌’ చిత్ర దర్శకుడు

అమలాపురం టౌన్‌: అమలాపురానికి చెందిన ఆయ్‌ చిత్ర దర్శకుడు కంచిపల్లి అంజిబాబు వినాయక చవితికి స్థానిక కొంకాపల్లిలోని తన స్వగృహానికి వచ్చారు. దీంతో ఆయన్ని పలు సంఘాల ప్రతినిధులు కలసి అభినందించారు. కోనసీమ యాసతో ఈ ప్రాంత కథాంశంతో అశ్లీలతకు తావు లేకుండా వినోదాత్మకంగా తీసిన ఆయ్‌ చిత్రం విజయవంతంపై దర్శకుడు అంజిబాబుతో ముచ్చటించారు. కోనసీమ జేఏసీ కన్వీనర్‌ బండారు రామ్మోహనరావు ఆధ్వర్యంలో మిత్ర బృందం కలసి అంజిబాబును అభినందించింది. కోనసీమ ప్రజలు ఈ చిత్రాన్ని బాగా ఓన్‌ చేసుకున్నారని అంజిబాబు తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. తన రెండో చిత్రం కూడా గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పైనే ఉండవచ్చని స్పష్టం చేశారు. కోనసీమ జేఏసీ ప్రతినిధులు రంకిరెడ్డి శ్రీనివాస్‌, నంద్యాల నాయుడు, ముత్యాల శరత్‌బాబు, కరాటం ప్రవీణ్‌ తదితరులు అంజిబాబును సత్కరించారు.

వచ్చే ఏడాదికి నూతన

టెర్మినల్‌ భవనం పూర్తి

మధురపూడి: రాజమహేంద్రవరం విమానాశ్రయం విస్తరణకు చర్యలు తీసుకుంటామని, దిల్లీ, తిరుపతి, షిర్డీలకు విమాన సర్వీసులు నిర్వహిస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. ఆదివారం మధురపూడిలోని విమానాశ్రయంలో జరుగుతున్న పనుల పురోగతి, విస్తరణపై ఆయన సమీక్షించారు. ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ జ్ఞానేశ్వర రావు రూ.173.28 కోట్ల ప్రతిపాదనలతో గతేడాది ఆగస్టు 13న పనులు ప్రారంభించినట్టు తెలిపారు. జరుగుతున్న నూతన టెర్మినల్‌ భవనం వచ్చే సంవత్సరం ఆగష్టు 11 వతేదీ నాటికి పూర్తిచేయాల్సిన లక్ష్యంతో పనులు జరుగుతున్నట్టు తెలిపారు. అలాగే విమానాస్రయ విస్తరణకు భూములిచ్చిన రైతుల సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement