నిండుకుండలా ‘ఏలేరు’ | - | Sakshi
Sakshi News home page

నిండుకుండలా ‘ఏలేరు’

Published Mon, Sep 9 2024 1:40 AM | Last Updated on Mon, Sep 9 2024 1:40 AM

నిండుకుండలా ‘ఏలేరు’

దిగువకు 7500 క్యూసెక్కుల విడుదల

21.38 టీఎంసీల నీటినిల్వలు

ఏలేశ్వరం: కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు ఏలేరు జలశయం నిండుకుండలా ఉంది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో నీటినిల్వలు పెరుగుతున్నాయి. ముందస్తు చర్యల్లో భాగంగా దిగువ ప్రాంతానికి 7500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సామర్థ్యం వరకు పెరిగితే నీటిని వదిలేందుకు అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. ప్రస్తుతం ఎగువప్రాంతం నుంచి 15.255 క్యూసెక్కుల వరదనీరు ప్రాజెక్టులోకి చేరుతున్నది. దీంతో ఆదివారం నాటికి ప్రాజెక్టులో 86.56 మీటర్లకు 85.20 మీటర్లు, 24.11 టీఎంసీలకు 21.38 టీఎంసీలకు నీటినిల్వలు చేరుకున్నాయి. దీంతో విశాఖకు మాత్రమే 275 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

ప్రజా సేవలో మరిన్ని

ఆర్టీసీ సర్వీసులు

రాజమహేంద్రవరం సిటీ: రాబోయే రోజుల్లో ఏపీఎస్‌ ఆర్టీసీ ద్వారా ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేందుకు రాష్ట్రంలో 1400 సర్వీసులను ప్రారంభిస్తున్నట్టు రాష్ట్ర క్రీడలు, రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్‌ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం రాజమహేంద్రవరం ఆర్టీసీ బస్‌ కాంప్లెక్స్‌ ఆవరణలో ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలకు సంబంధించి 22 నూతన సర్వీసులను ప్రారంభించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలతో పాటు, వారి ఆరోగ్యంపైనా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిపారు. రాబోయే రోజుల్లో నాణ్యతతో కూడిన సేవలు అందించే దిశగా ఎలక్ట్రికల్‌ బస్సు సర్వీసులను ప్రారంభించనున్నామని తెలిపారు. రాష్ట్రంలో పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలను అనుసంధానం చేస్తూ సర్వీసులను ప్రారంభించే దిశగా పూర్తిస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు. క కలెక్టర్‌ పి. ప్రశాంతి, అధికారులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement