రౌతులపూడి: ట్రాక్టర్ బోల్తా పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. బంగారయ్యపేట గ్రామానికి చెందిన పబ్బిరెడ్డి శ్రీను (40) శనివారం ఉదయం గ్రామ శివారున ఉన్న ఇటుకుల బట్టీలో మట్టిని దమ్ము చేసే పనికి వెళ్లాడు. ట్రాక్టర్‌తో మట్టిని శ్రీను దమ్ము చేస్తుండగా అదుపు తప్పి బోల్తా పడింది. మట్టిలో కూరుకుపోయిన శ్రీను ఛాతిపై ట్రాక్టర్ పడి ఊపిరి ఆడకపోవటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేస్తామని రౌతులపూడి ఎస్సై వెంకటేశ్వరరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment