సీటీఆర్ఐ: దివ్యాంగుల క్రికెట్ టోర్నీ వచ్చేనెల 8వ తేదీ నుంచి విశాఖలో నిర్వహిస్తున్నట్టు అఖిల భారత దివ్యాంగుల హక్కుల జాతీయ కార్యదర్శి ముత్యాల పోసికుమార్ అన్నారు. రాష్ట్ర దివ్యాంగుల క్రికెట్ డెవలప్మెంట్ అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా ఇన్చార్జి పల్నాటి బలరామకృష్ణ ఆధ్వర్యంలో స్థానిక వై జంక్షన్ వద్ద ఈ టోర్నీ సన్నాహక సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పోసికుమార్ మాట్లాడుతూ డిసెంబర్ 8 నుంచి 11వ తేదీ వరకు విశాఖలోని గాజువాక జింక్ గ్రౌండ్లో పది జిల్లాల దివ్యాంగుల క్రికెట్ టోర్నీ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు 98858 64940, 92473 86666 ఫోన్ నెంబర్లను సంప్రదించి తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. 22వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు లాలాచెరువు మైదానంలో ఎంపికలు ఉంటాయన్నారు. బలరామకృష్ణ మాట్లాడుతూ ఈ సదవకాశాన్ని దివ్యాంగులంతా ఉపయోగించు కోవాలని, బుధ, గురు వారాలలో తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.
అఖిల భారత దివ్యాంగుల హక్కుల
జాతీయ కార్యదర్శి పోసికుమార్
విశాఖపట్నం గాజువాకలోని
జింక్ మైదానంలో నిర్వహణ
విజయవంతం చేయాలని
జిల్లా కెప్టెన్ బలరామకృష్ణ పిలుపు
Comments
Please login to add a commentAdd a comment