ఐ.పోలవరం: గోదావరిలో స్నానానికి వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి మృతి చెందాడు. ముమ్మిడివరం నగర పంచాయతీ క్రాప చింతలపూడికి చెందిన మాదాల వెంకటేశ్వరరావు (57) గురువారం మురమళ్లలో గోదావరిలో స్నానానికి వెళ్లాడు. ప్రమాదవశాత్తూ నీట మునిగి మృతి చెందాడు. అతని మృతదేహం శనివారం ముమ్మిడివరం మండలం అన్నంపల్లి పంచాయతీ పరిధిలోని లక్ష్మీదేవిలంక వద్ద గోదావరిలో లభ్యమైంది. వెంకటేశ్వరరావుకు భార్య కన్యకాపరమేశ్వరి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బంధువుల ఫిర్యాదు మేరకు ఎస్సై డి.జ్వాలాసాగర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment