హామీలు నెరవేర్చాలని సీపీఐ డిమాండ్
అమలాపురం టౌన్: కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని సీపీఐ, భారతీయ కిసాన్ మజ్దూర్ యూనియన్ (బీకేఎంయూ) నేతల డిమాండ్ చేశారు. ఈ హామీల్లో ఒకటైన పేదోడికి సొంతింటి కల సాకారమయ్యేలా చూడాలని సూచించారు. సీపీఐ, బీకేఎంయూ రాష్ట్ర వ్యాప్త పోరాటాల్లో భాగంగా నిర్వహించిన డిమాండ్స్ డే సందర్భంగా నాయకులు జిల్లాలోని పలు గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇళ్లు, భూమి లేని నిరుపేదలైన ఆశావహులతో కలసి సోమవారం వినతి పత్రాలు అందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో... గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 3 సెంట్ల స్థలాలు ఇచ్చి ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చారని సీపీఐ జిల్లా కార్యదర్శి కె.సత్తిబాబు గుర్తు చేశారు. వ్యవసాయ భూమి లేని నిరు పేదలకు 2 ఎకరాల వ్యవసాయ భూమి ఇవ్వాలని సత్తిబాబు చేశారు. రామచంద్రపురం, మండపేట, అమలాపురం, కొత్తపేట నియోజకవర్గాల్లోని పలు సచివాలయాల్లో అర్జీలు ఇచ్చినట్టు బీకేఎంయూ జిల్లా కార్యదర్శి కె.రామకృష్ణ తెలిపారు.
డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా తగదు
అమలాపురం రూరల్: మెగా డీఎస్సీని రాజ్యాంగ విరుద్ధమైన ఎస్సీ వర్గీకరణ సాకుతో వాయిదా వేయ డం తగదని కలెక్టరేట్ వద్ద మాల మహానాడు, బీఈడీ అసోసియేషన్, ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు సోమవారం ధర్నా నిర్వహించారు. పండు అశోక్ కుమార్, జంగా బాబురావు, పెయ్యల పరశురాముడు మాట్లాడుతూ ఎందరో నిరుద్యోగులు డీ ఎస్సీ కోసం ఎదురుచూస్తున్నారన్నారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట తప్పి డీఎస్సీ ఎలా వాయిదా వేస్తారని ప్రశ్నించారు. వెంటనే డీఎ స్సీ నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగులను ఆదుకోవాలని కలెక్టర్ కార్యాలయంలో వారు వినతిపత్రాన్ని సమర్పించారు. జల్లి శ్రీనివాస్, పెయ్యల చిట్టి బాబు, నాతి శ్రీనివాసరావు, గెల్లా వెంకటేష్, గెద్దాడ బుద్ధరాజు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment