బాలాజీకి ధనుర్మాసం పూజలు
ఆండాళ్ తాయార్‌కు పంచామృత స్నపనం
మామిడికుదురు: విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం ధనుర్మాసం. ధనస్సు రాశిలో సూర్యుడు ధనుస్సంక్రమణం చెందిన వేళ అప్పనపల్లి శ్రీబాల బాలా జీ స్వామి సన్నిధిలో సోమవారం వేకువ జామున ధనుర్మాస వ్రతం ఘనంగా ప్రారంభమైంది. ధనుర్మాసం ప్రారంభం సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం వేద పాఠశాల నుంచి వచ్చిన పాంచరాత్ర ఆగమ పండితులు, ఆలయ అర్చక స్వాములతో కలిసి మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాహలం నడుమ తీర్థపు బిందెతో వైనతేయ గోదావరి నది నుంచి ఊరేగింపుగా జలాలు తీసుకు వచ్చారు. దివ్య ప్రబంధం సేవ వైభవంగా నిర్వహించారు. ఆండాళ్‌తాయార్ (గోదాదేవి)కి పంచామృత స్నపనం ఘనంగా జరిపించారు. తీర్థపు బిందెతో తీసుకు వచ్చిన జలాలతో అభిషేకం చేశారు. ఆలయ ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు ఆధ్వర్యంలో ధనుర్మాసం పూజలు వైభవంగా నిర్వహించారు. వేద మంత్రాలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. పలువురు భక్తులు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామితో పాటు అమ్మవార్లను దర్శించుకుని, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమాలు ఆద్యంతం వైభవోపేతంగా జరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment