తుని: విశాఖ ఏజెన్సీ నుంచి గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశామని తుని రూరల్ సీఐ చెన్నకేశవరావు, కోటనందూరు ఎస్సై టి.రామకృష్ణ తెలిపారు. గురువారం జిల్లా ఎప్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు కోటనందూరు సెంటర్లో వాహనాలను తనిఖీ చేస్తుండగా గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించామన్నారు. బాపట్ల జిల్లాకు చెందిన మరిప్రోలు నాగేంద్రరెడ్డి, కుంచాల చిరంజీవి ప్రయాణిస్తున్న వాహనంలో 24.32 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ప్రాంతంలో రూ.48 వేలతో గంజాయిని కొనుగోలు చేసి బాపట్లకు తరలిస్తున్నట్టు నిందితులు చెప్పారన్నారు. కారు సీజ్ చేయడంతో పాటు రెండు సెల్‌ఫోన్లు, రూ.నాలుగు వేల నగదు స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశామన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment