గోదావరి కాలువలోకి దూకి వ్యక్తి గల్లంతు
సామర్లకోట: స్థానిక గోదావరి కాలువలో గురువారం రాత్రి ఏడు గంటల ప్రాంతంలో దూకిన ఒక వ్యక్తి గల్లంతు అయిన ఘటన ఇది. పోలీసుల కథనం ప్రకారం పెదపూడికి చెందిన షేక్ సలీమ్ (36) ఒక మహిళతో వచ్చి రైల్వే గేటు ఎదురుగా ఉన్న గోదావరి కాలువపై ఉన్న నూతన వంతెన నుంచి గోదావరి కాలువలోకి దూకాడు. ఆ సమయంలో సలీమ్‌తో వచ్చిన మహిళకు తన సెల్‌ఫోన్ అతను ఇచ్చినట్టు పోలీసులు తెలిపారు. అదే సమయంలో పంచారామ క్షేత్రం నుంచి వస్తున్న కానిస్టేబుల్ విషయాన్ని తెలుసుకొని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దాంతో సీఐ ఎ.దుర్గాప్రసాద్, ట్రాఫిక్ ఎస్సై అడపా గరగారావు ఘట నా ప్రదేశానికి చేరుకున్నారు. సలీమ్ గోదావరి కాలువలోకి దూకిన విషయాన్ని భార్య ఈశ్వరికి పోలీసులు సమాచా రం ఇచ్చారు. ఘటనా ప్రదేశానికి చేరుకున్న ఈశ్వరి విష యం తెలిసి స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే ట్రాఫిక్ ఎస్సై తన వాహనంలో ఈశ్వరిని స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. విష యం తెలుసుకున్న బంధువు లు ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. వైఎస్సార్ సీపీ పెద్దాపురం మైనార్టీ సెల్ అధ్యక్షుడు జానీ మాట్లాడుతూ సలీమ్ ఒక లోకల్ పేపర్‌లో విలేకరిగా పని చేస్తున్నాడని చెప్పారు. ఈశ్వరి అనే మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడన్నారు. అయితే ఎందుకు గోదావరి కాలువలోకి దూకాడో తెలియని చెప్పారు. ఈ ఘటన జరుగుతున్న సమయంలో సలీమ్‌తో వచ్చిన మహిళ చల్లగా జారుకుంది. సీఐ కృష్ణభగవాన్ గజ ఈతగాళ్ల సహాయంతో గోదావరి కాలువలో సలీమ్ కోసం గాలింపు చేపట్టారు. కేసు నమోదు చేసి సీఐ దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment