రేపటి నుంచి రోలర్ స్కేటింగ్ పోటీలు
అమలాపురం టౌన్: జిల్లా రోలర్ స్కేటింగ్ క్లబ్ ఆధ్వర్యంలో అమలాపురం బాలయోగి స్కేటింగ్ రింగ్‌లో ఈ నెల 11,12 తేదీల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా స్థాయి 2వ రోలర్ స్కేటింగ్ చాంపియన్ షిప్–2025 పోటీలు జరుగుతాయని జిల్లా స్కేటింగ్ క్లబ్ ఓ ప్రకటనలో తెలిపింది. 5 నుంచి 17 సంవత్సరాల వయసు వారు ఈ పోటీలకు అర్హులని పేర్కొంది. ఉమ్మడి జిల్లా నుంచి 200 మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటారని క్లబ్ తెలిపింది. అమలాపురానికి చెందిన హైదరాబాద్, విశాఖ మెట్రోకెమ్ కంపెనీల అధినేత డాక్టర్ నందెపు వెంకటేశ్వరరావు సహకారంతో పోటీలను నిర్వహిస్తున్నట్లు క్లబ్ ప్రతినిధులు పేర్కొన్నారు.
పందలపాకలో
భారీ అగ్ని ప్రమాదం
బిక్కవోలు: మండలంలోని పందలపాక గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. శుక్రవారం పంచాయతీ చెరువు వద్ద ఎన్‌టీఆర్ విగ్రహం ఎదురుగా కానూరి శంకరరావుకు చెందిన పాత ప్లాస్టిక్ సంచుల గొడౌన్ విద్యుత్ షార్టుస్కరూట్ ఏర్పడి ఈ ప్రమాదం జరిగిందని అగ్నిమాపక అధికారి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. మధ్యాహ సమయం కావడంతో గొడౌన్ వద్ద ఎవరూ లేరు. విద్యుత్ షార్టుస్కరుట్ వలన నిప్పులు రావడంతో ఒకసారిగా మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను పూర్తిగా ఆర్పివేశారు. రూ.2లక్షల ఆస్తినష్టం సంభవించిందని అధికారులు తెలిపారు. బాధితుడు శంకరావును ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పరమర్శించారు. ఉప సర్పంచ్ పడాల వెంకటరామారెడ్డి, ఎంపీటీసీ మాజీ సభ్యులు సబ్బారపు సూర్యనారాయణ, సబ్బెళ్ళ విజయభాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment