ఏమిట్రీ వింత..!
ఒకే మొదలుకు రెండు కొబ్బరిచెట్లు
అల్లవరం: సాధారణంగా ఒక విత్తనం నుంచి ఒకే మొక్క రావడం మనం చూస్తుంటాం. మొలకెత్తిన మొక్క నుంచి అంటుకుట్టే విధానం ద్వారా అనేక మొక్కలను సృష్టించడమూ తెలిసిందే. అయితే మొక్క నుంచి అంటుకట్టే విధానం కొబ్బరిలో సాధ్యం కాదు. కొబ్బరి మొక్క తయారు కావాలంటే పండిన కొబ్బరి కాయను భూమిలో పాతి నీరు పెట్టడం ద్వారా రెండు నెలల తర్వాత అంకురం ఏర్పడి క్రమేణా పెరిగి ఐదేళ్ల వయసు తర్వాత కొబ్బరి కాయల కాపు ప్రారంభం అవుతుంది. అయితే దేవగుప్తంలోని రమణాతి పల్లంశెట్టి ఇంటి ఆవరణలో నాటిన కొబ్బరి మొక్క రెండు చెట్లుగా ఎదుగుతోంది. మొదలు ఒకటిగానే ఉన్నా చిగుర్లు మాత్రం రెండుగా విడిపోయి రెండు చెట్లుగా మాను ఏర్పడింది. కాపునకు సిద్ధంగా ఉంది. రెండు చెట్లను విడదీసే ప్రయత్నం చేశామని, అయితే ఒకే మొదలు ఉండడంతో సాధ్యం కాలేదని పల్లంశెట్టి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment