దొంగతనం కేసులో నలుగురికి జైలు | - | Sakshi
Sakshi News home page

దొంగతనం కేసులో నలుగురికి జైలు

Published Fri, Jan 10 2025 2:46 AM | Last Updated on Fri, Jan 10 2025 2:46 AM

దొంగతనం కేసులో  నలుగురికి జైలు

దొంగతనం కేసులో నలుగురికి జైలు

కపిలేశ్వరపురం: దొంగతనం నేరారోపణలో విచారణాంశాలు రుజువు కావడంతో నలుగురు నిందితులకు జైలు శిక్ష విధిస్తూ ఆలమూరు జేఎఫ్‌సీఎం కోర్టు జడ్జి ఐ.ప్రవీణ్‌కుమార్‌ గురువారం తీర్పు చెప్పారు. అంగర ఎస్సై డి.రవికుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం... తన ఇంటిలో రాత్రి సమయంలో బంగారం, వెండి ఆభరణాలు దొంగతనానికి గురయ్యాయంటూ కపిలేశ్వరపురం గ్రామానికి చెందిన గరగపాటి సూర్యకుమారి 2023 జూలై 17న అంగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి ఎస్సై జి. చంటి కేసు నమోదు చేశారు. కేసులో నిందితులైన కాజులూరుకు చెందిన షేక్‌ అజీజ్‌, రాజమహేంద్రవరానికి చెందిన యడ్ల ఉషా సూర్య వెంకట రాకేష్‌, తాతపూడికి చెందిన కాండ్రేగుల శ్రావణ కృష్ణ, ఇంద్రపాలెంనకు చెందిన ముషినాడ గౌరీ మల్లేశ్వరి నేరం చేసినట్లు రుజువైంది. నిందితులకు మూడేళల సాధారణ జైలు శిక్ష, రూ.పదివేల చొప్పున జరిమానా విధిస్తూ ఆలమూరు జేఎఫ్‌సీఎం కోర్టు జడ్జి తీర్పు చెప్పారు. బాధితురాలి తరపున ఏపీపీ విల్లా శ్రీరాములు వాదించారు.

వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు

అల్లవరం: మండలంలోని బెండమూర్లంకకు చెందిన బొక్కా లక్ష్మీ వెంకటరమణ (29) అదృశ్యంపై కేసు నమోదు చేశామని ఎస్సై హరీష్‌కుమార్‌ గురువారం తెలిపారు. డిసెంబర్‌ 23న ఇంటి నుంచి వెళ్లిన ఆయనకు సోదరుడు నాగేంద్ర ఫోన్‌ చేయగా విజయవాడ వెళ్లానని, పని చేసుకుని వస్తానని చెప్పాడని తెలిపారు. అప్పటి నుంచి ఫోన్‌ స్విచ్చాఫ్‌లో ఉందని, ఇంటికి రాలేదని నాగేంద్ర అల్లవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement