పురాతన చరిత్ర నిడదవోలు సొంతం | Sakshi
Sakshi News home page

పురాతన చరిత్ర నిడదవోలు సొంతం

Published Mon, May 6 2024 10:55 AM

పురాత

నియోజకవర్గం ఏర్పడింది మాత్రం 2009లోనే..

చాళుక్యులు, కాకతీయులు ఏలిన పట్టణం

పురాతన శైవాలయాలకు,

చర్చిలకు ప్రసిద్ధి

నిడదవోలు: ఘనమైన చరిత్ర గల పురాతన పట్టణం నిడదవోలు. పూర్వం నిరవజ్జపురం, నిరవజ్జప్రోలు అనే పేర్లతో ప్రసిద్ధి పొంది నేడు నిడదవోలుగా పిలువబడుతోంది. ఈ పట్టణాన్ని మొదట చాళుక్యరాజులు పాలించారు. అనంతరం వారు కాకతీయ రాజులతో వియ్యం అందుకోవడంతో కాకతీయులు కొంతకాలం ఏలారు. వీరి హయాంలో శిల్పకళ అభివృద్ధి చెందింది. కొన్నేళ్ల క్రితం పట్టణంలో జరిపిన తవ్వకాల్లో బయటపడిన అందమైన విగ్రహాలు కాకతీయుల చరిత్రకు నిదర్శనంగా నిలిచాయి. నిడదవోలు పురాతన ఆలయాలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడి చినకాశిరేవులో సుమారు 30 ఆలయాలున్నాయి. పట్టణంలోని పురాతన గోలింగేశ్వరస్వామి, సోమేశ్వరస్వామి ఆలయాలు ప్రసిద్ధి చెందాయి. అలాగే రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో మండలంలోని తిమ్మరాజుపాలెంలో కొలువైన కోట సత్తెమ్మ వారి ఆలయం ఒకటిగా ప్రసిద్ధి చెందింది. రాష్ట్ర నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ ఆలయానికి ఏడాదికి రూ.3 కోట్లకు పైగా ఆదాయం వస్తోంది. పట్టణంలోని చర్చిపేటలో 100 ఏళ్ల చరిత్ర గల కృపాధార లూథరన్‌ దేవాలయం, కురేషియా పెద మసీదులు ఎంతో పేరు గాంచాయి.

రాజకీయ పోరు

నిడదవోలు నియోజకవర్గం 2009లో ఏర్పడింది. తొలిసారిగా 2009లో నిర్వహించిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బూరుగుపల్లి శేషారావు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ ఎన్నికల్లో శేషారావు 5,766 ఓట్ల మెజారిటీతో అప్పటి కాంగ్రెస్‌ అభ్యర్థి జి.శ్రీనివాస్‌నాయుడిపై విజయం సాధించారు. ప్రజారాజ్యం తరఫున పోటీ చేసిన రుద్రరాజు గజపతి కుమార్‌ రాజుకు 44,511 ఓట్లు దక్కాయి. 2014 ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గానికే చెందిన బూరుగుపల్లి శేషారావు రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో శేషారావుకు 81,591 ఓట్లు రాగా, వైఎస్సార్‌ సీసీ తరుఫున పోటీ పడిన ఎస్‌.రాజీవ్‌కృష్ణకు 75,232 ఓట్లు దక్కాయి. బూరుగుపల్లి శేషారావుకు 6,352 ఓట్ల మెజార్టీ లభించింది. పోలింగ్‌ శాతం 85.56గా నమోదైంది. ఇక 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ తరఫున పోటీ చేసిన జి.శ్రీనివాస్‌నాయుడు 24,000 ఓట్ల మెజారిటీతో గెలిచాలి. ఆయన ప్రధాన ప్రత్యర్థి బూరుగుపల్లి శేషారావు.

నియోజకవర్గ స్వరూపం

నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో నిడదవోలు నియోజకవర్గం ఏర్పడింది. నిడదవోలు మున్సిపాలిటీతో పాటు నిడదవోలు, ఉండ్రాజవరం, పెరవలి మండలాలు ఇందులో చేరి ఉన్నాయి. అంతకు ముందు నిడదవోలు పట్టణంతో పాటు నిడదవోలు మండలం కొవ్వూరు నియోజకవర్గంలోను, ఉండ్రాజవరం మండలం తణుకు నియోజకవర్గంలోను, పెరవలి మండలం పెనుగొండ నియోజకవర్గంలోను అంతర్భాగంగా ఉండేవి. 1999 ఎన్నికల నాటికి పూర్వపు ఉమ్మడి గోదావరి జిలాల్లో 16 నియోజకవర్గాలు ఉండేవి. ఆ ఎన్నికల్లో మొత్తం 15 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు ఓటమి పాలయ్యాయి. ఒక్క కొవ్వూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన జీఎస్‌ రావు మాత్రమే ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర సలహామండలి సభ్యుడిగా దివంతగ మహానేత వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు జీఎస్‌రావు పీసీసీ అధ్యక్షుడిగా సేవలు అందించారు.

భౌగోళిక స్వరూపం

నిడదవోలు అసెంబ్లీ సెగ్మెంట్‌ 282.92 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. సరిహద్దులుగా తూర్పున గోదావరి (ఆచంట నియోజకవర్గం), పడమరన గోపాలపురం నియోజకవర్గం (దేవరపల్లి మండలం), ఉత్తరాన కొవ్వూరు నియోజకవర్గం (చాగల్లు మండలం) దక్షిణాన తాడేపల్లిగూడెం నియోజకవర్గం (తాడేపల్లిగూడెం మండలం). కాగా నియోజకవర్గ కేంద్రమైన నిడదవోలు ద్వితీయ శ్రేణి మునిసిపాలిటీ.

ప్రధాన పంటలు

నియోజకవర్గంలో వ్యవసాయం ప్రధాన వృత్తి. మూడు మండలాల్లోని 36,500 ఎకరాల్లో వరి, 1,500 ఎకరాల్లో అరటి, కంది, పసుపు, జామ, కోకో, ఆకుకూరలు, పూల తోటలు సాగులో ఉన్నారు. చెంతనే పశ్చిమ డెల్టా గోదావరి ప్రధాన కాలువ జీవ నదిని తలపిస్తూ ప్రవహిస్తోంది.

సాగునీటి ఇబ్బందులు లేకుండా ఏటా పుష్కలంగా రెండు పంటలు పండుతున్నాయి. జూన్‌ 2019 నుంచి నుంచి ఫిబ్రవరి 2024 వరకూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నియోజకవర్గ ప్రజలకు వివిధ సంక్షేమ పథకాల ద్వారా రూ.1450 కోట్లు ఖర్చు చేసింది. అలాగే నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులకు రూ.670 కోట్లు వెచ్చింది.

నిడదవోలు నియోజకవర్గంలో...

నిడదవోలు పురపాలక సంఘం

నిడదవోలు మండలం

ఉండ్రాజవరం మండలం

పెరవలి మండలం

వివిధ సంక్షేమ పథకాలు.. లబ్ధిదారుల వివరాలు,

పొందిన మొత్తం వివరాలు

పథకం లబ్ధిదారులు (లబ్ధి

రూ.కోట్లలో)

జగనన్న అమ్మఒడి 22,260 109.60

జగనన్న వసతి దీవెన 4,818 15.41

జగనన్న విద్యాదీవెన 14,427 42.61

వైఎస్సార్‌ రైతు భరోసా 22,726 126.83

వైఎస్సార్‌ సున్నా వడ్డీ (రైతులకు) 7,761 2.12

వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా 14,510 35.57

రైతుల ఇన్‌పుట్‌ సబ్సిడీ 9,444 14.07

వైఎస్సార్‌ సున్నా వడ్డీ (ఎస్‌హెచ్‌జీ) 15,560 34.98

వైఎస్సార్‌ పింఛను కానుక 33,553 373.84

వైఎస్సార్‌ చేయూత 9,044 59.24

వైఎస్సార్‌ ఆసరా 4,815 185.36

వైఎస్సార్‌ బీమా 196 4.99

వైఎస్సార్‌ కాపు నేస్తం 4,344 15.77

జగనన్న చేదోడు 1,281 2.59

ఇతర పథకాలు

వైఎస్సార్‌ వాహనమిత్ర 1,300 3.10

వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా 1,288 1.98

వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ 14,940 51.47

ఆగ్రి గోల్డ్‌ బాధితులకు సాయం 2,102 1.32

వైఎస్సార్‌ కల్యాణమస్తు, షాదీతోఫా 284 1.64

లా నేస్తం 78 11 ( రూ.లక్షలు)

అర్చకులు, ఇమాం, మౌజ్‌, పాస్టర్లు 244 27 (రూ. లక్షలు

నేతన్న నేస్తం 08 04 (రూ.లక్షలు)

నాన్‌ డీబీటీ పథకాలు

జగనన్న తోడు 3,205 4.14

జగనన్న గోరుముద్ద 32,672 2.29

వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ 40,496 29.92

జగనన్న విద్యాకానుక 41,069 6.69

ఇళ్ల స్థలాలు (భూసేకరణ) 11,197 109.90

ఇంటి రుణాలు 10,200 193.29

ఓటీఎస్‌ పట్టాలు 7,362 2.99

వైఎస్సార్‌ కంటి వెలుగు 6,449 32 ( రూ.లక్షలు)

నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,13,396

పురుషులు 1,04,235

మహిళలు 1,09,157

ఇతరులు 04

పట్టణం, మండలాల వారీగా..

నిడదవోలు మునిసిపాలిటీ 35,112

నిడదవోలు మండలం 58,216

ఉండ్రాజవరం 62,362

పెరవలి 57,706

మొత్తం పోలింగ్‌ స్టేషన్లు 205

పురాతన చరిత్ర నిడదవోలు సొంతం
1/2

పురాతన చరిత్ర నిడదవోలు సొంతం

పురాతన చరిత్ర నిడదవోలు సొంతం
2/2

పురాతన చరిత్ర నిడదవోలు సొంతం

Advertisement
 

తప్పక చదవండి

Advertisement