తాటిపర్తి ఘటనలో మాజీ ఎమ్మెల్యే వర్మ హస్తం | Sakshi
Sakshi News home page

తాటిపర్తి ఘటనలో మాజీ ఎమ్మెల్యే వర్మ హస్తం

Published Tue, May 7 2024 11:40 AM

తాటిపర్తి ఘటనలో మాజీ ఎమ్మెల్యే వర్మ హస్తం

గొల్లప్రోలు: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని వైఎస్సార్‌ సీపీ నాయకులు అన్నారు. తాటిపర్తి గ్రామంలో జరిగిన సంఘటన వెనుక ఆయన హస్తం ఉందని ఆరోపించారు. ఈ మేరకు సోమవారం మాజీ ఎమ్మెల్యే వర్మపై గొల్లప్రోలు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తాటిపర్తి గ్రామంలో ఆదివారం సాయిధరమ్‌తేజ్‌ ఎన్నికల ప్రచార ర్యాలీలో జరిగిన వివాదం నేపథ్యంలో గొల్లప్రోలు, రూరల్‌ మండల వైఎస్సార్‌ సీపీ నాయకులు ఈ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా తాటిపర్తి ఉప సర్పంచ్‌ దాసం వెంకటేష్‌ విలేకరులతో మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే వర్మ స్థానిక యువకులను రెచ్చగొట్టి భౌతిక దాడులకు ప్రోత్సహిస్తున్నారన్నారు. తమ ఇళ్లపై రాళ్ల దాడులు చేయించారని తెలిపారు. సాయిధరమ్‌తేజ్‌పై జరిగిన సంఘటనతో తమ కార్యకర్తలకు ఎటువంటి సంబంధం లేదన్నారు. ఆ ఘటననూ తామూ ఖండిస్తున్నామని, పోలీసులు విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

హత్యా రాజకీయాలకు

ఆయన ప్రోత్సాహం

గొల్లప్రోలు పోలీసులకు

వైఎస్సార్‌ సీపీ నాయకుల ఫిర్యాదు

 
Advertisement
 
Advertisement