దళారుల చేతుల్లో ఇసుక
కూటమి ప్రభుత్వ పాలనలో ఇసుక దళారుల చేతుల్లోకి వెళ్లిపోయింది. వారు మాత్రమే ఇసుక అమ్ముకుంటున్నారు. కూటమి నాయకుల కన్నుసన్నల్లోనే ఇదంతా జరుగుతోంది. ఇసుక దోపిడీని అరికట్టనంత వరకూ భవన నిర్మాణ కార్మికులకు పనులుండవు.
– తాటిపాక మధు, జిల్లా గౌరవ అధ్యక్షుడు,
ఏపీ బిల్డింగ్ అండ్ కన్‌స్ట్రక్షన్
వర్కర్స్ యూనియన్
ఎన్నికల హామీలు అమలు చేయాలి
ఎన్నికల ముందు చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఉచిత ఇసుక ఇస్తామని భవన నిర్మాణ రంగానికి ఆశలు చూపించారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని పూర్తిగా ముంచేశారు. పేరుకే తప్ప ఉచిత ఇసుక ఆచరణలో అమలు కావడం లేదు. వేరేచోట నుంచి పెద్ద పెద్ద లారీలతో వచ్చి, ఇక్కడి ఇసుకను తరలించుకుపోతున్నారు.
– పందేళ్ల భానుప్రసాద్, జిల్లా అధ్యక్షుడు,
భవన నిర్మాణ కార్మిక సంఘం
దళారులను అరికట్టాలి
ఇసుకను దోచుకుంటున్న దళారులను అరికట్టాలి. స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేయాలి. ఇసుక అధిక ధరలను నియంత్రించాలి. భవన నిర్మాణ కార్మికులకు, సామాన్య ప్రజలకు, ఇంజినీర్లకు, బిల్డర్లకు ఇసుక అందుబాటులోకి తీసుకురావాలి. అప్పుడే భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి దొరుకుతుంది.
– కోల సురేష్,
కడియం
సంక్షేమ మండలి
ఏర్పాటు చేయాలి
రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ మండలి ఏర్పాటు చేసి, సంక్షేమ పథకాలు అమలు చేయాలి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సుమారు రూ.5 కోట్ల క్లెయిమ్ నిధులను తక్షణమే మంజూరు చేయాలి.
– రామకృష్ణ, శ్యామల సెంటర్,
రాజమహేంద్రవరం
Comments
Please login to add a commentAdd a comment