ఆడబిడ్డలను వంచించారు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆడబిడ్డ నిధి పథకం ద్వారా 19 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్సు మహిళల బ్యాంక్ ఖాతాల్లో ప్రతి నెలా రూ.1,500 చొప్పున జమ చేస్తామని చెప్పి ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఊసే ఎత్తడం లేదు. రాష్ట్ర బడ్జెట్‌లో కూడా కేటాయింపులు లేకపోవడం దారుణం. గతంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మహిళలకు అండగా ఉండటంతో పాటు ఆర్థికంగా తోడుగా నిలిచేందుకు వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ఏటా రూ.18,750 అందించారు. మహిళలను నిలువునా మోసం చేసిన కూటమి ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి.
– కాలాబత్తుల సుజాత, జిల్లా సమాఖ్య
మాజీ అధ్యక్షురాలు, పందలపర్రు
Comments
Please login to add a commentAdd a comment