రైతుల మెడకు ఉరితాళ్లు
వ్యవసాయ పంపు సెట్లకు స్మార్ట్ మీటర్లు బిగిస్తూంటే రైతులకు ఉరితాళ్లు బిగిస్తున్నారంటూ గతంలో మండిపడిన చంద్రబాబు.. ప్రస్తుతం అవే మీటర్లు బిగించాలని నిర్ణయించడం దారుణం. బడ్జెట్లో రైతులకు తీరని అన్యాయం చేశారు. అన్నదాత సుఖీభవ, వడ్డీ లేని రుణాలకు కేటాయింపులు లేవు. పంటల బీమా రైతులే కట్టుకోవాలనడం దారుణం. ఉద్యాన పంటలకు కనీస మద్దతు ధర కల్పించే మార్కెటింగ్ సదుపాయాలపై ప్రకటన లేదు. ధాన్యానికి బోనస్ ఇవ్వడం లేదు.
– కె.శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం
రాష్ట్ర సహాయ కార్యదర్శి
ప్రజలకు క్షమాపణ చెప్పాలి
గత ప్రభుత్వ హయాంలో రూ.14 లక్షల కోట్ల అప్పులు చేసినట్లు టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేశారు. ఏపీ మరో శ్రీలంక అయిపోతుందని ఆరోపించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నెలల వ్యవధిలోనే రూ.4 లక్షల కోట్లు అప్పు చేశారు. మాపై తప్పుడు ప్రచారం చేసిన టీడీపీ నేతలు, పచ్చ మీడియా ప్రజలకు క్షమాపణలు చెప్పాలి.
– చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ,
మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ
జిల్లా అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment