కొవ్వూరు: పట్టణంలోని గౌతమీనగర్‌లో 2022 సెప్టెంబర్ ఆరో తేదీ రాత్రి దూళిపాళ్ల గోపాల దక్షిణామూర్తి ఇంట్లో చోరీకి పాల్పడిన కేసులో తిరివీధి సురేంద్ర అనే వ్యక్తికి రెండేళ్ల జైలు శిక్ష పడినట్లు పట్టణ సీఐ పి.విశ్వం తెలిపారు. ఏలూరు జిల్లా చాట్రాయి మండలం చిత్తపూర్ గ్రామానికి చెందిన సురేంద్ర రూ.2.40 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాల చోరీకి పాల్పడ్డాడు. అప్పటి పట్టణ పోలీసు స్టేషన్‌లో సీఐ ఏఎల్‌ఎస్ రవికుమార్ కేసు నమోదు చేశారు.
విచారణలో సురేంద్రపై నేరం రుజువు కావడంతో సెకండ్ అడిషనల్ అండ్ జ్యుటీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కె.నాగలక్ష్మి రెండేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారని తెలిపారు. ప్రాసిక్యూషన్ తరఫున డి.బాబూరావు వాదించారు.
Comments
Please login to add a commentAdd a comment