కిర్లంపూడి: మండల పరిధి సోమవరం జాతీయ రహదారిపై అక్రమంగా తరలిస్తున్న 163 కేజీల గంజాయిని సోమవారం కిర్లంపూడి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కిర్లంపూడి ఎస్సై జి.సతీష్ తన సిబ్బందితో సోమవరం జాతీయ రహదారిపై వాహనాల తనిఖీలు నిర్వహించారు. వైజాగ్ నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న గూడ్స్ వ్యాన్‌ను తనిఖీ చేయగా నాలుగు బస్తాలతో ఉన్న 163 కేజీల గంజాయిని గుర్తించారు. తమిళనాడుకు చెందిన రంగస్వామి సత్యానందం, నవమాని గురుస్వామి(నటరాజ్)ను అదుపులోకి తీసుకుని, వాహనాన్ని, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను ప్రత్తిపాడు కోర్టుకు తరలించగా 14 రోజులు రిమాండ్ విధించారు. వారిని సబ్ జైలుకు తరలించామని సీఐ వైఆర్కే శ్రీనివాస్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment