ఆస్పత్రికి వెళుతూ అనంతలోకాలకు..
గండేపల్లి: కన్న కొడుకుని ఆస్పత్రికి తీసుకువెళుతుండగా జరిగిన ప్రమాదంలో తండ్రి మృతి చెందగా కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. గండేపల్లి ఎస్సై యూవీ శివ నాగబాబు వివరాల మేరకు కిర్లంపూడి మండలం జగపతినగరానికి చెందిన తాటిపాక గంగరాజు (28) భార్యాపిల్లలతో రంగంపేటలోని కోళ్లఫారంలో నివాసం ఉంటున్నాడు. సోమవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో అతని కుమారుడు అనిల్ అనారోగ్యానికి గురికావడంతో స్కూటీపై రంగంపేట మండలం ఆనూరులోని ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు బయలుదేరాడు. రామేశంపేట వైపు నుంచి వెళుతుండగా ఎదురుగా వస్తున్న మినీ వ్యాన్ స్కూటీని బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో గంగరాజు తలకు బలమైన గాయమై, కుడికాలు నుజ్జయి అక్కడికక్కడే మృతి చెందాడు. అనిల్ రోడ్డుపై పడిపోవడంతో కుడికాలుకు తీవ్ర గాయమైనట్టు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పెద్దాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి మృతుని భార్య సునీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్టు పేర్కొన్నారు.
వ్యాన్ ఢీకొని తండ్రి మృతి
కుమారుడికి తీవ్ర గాయాలు
Comments
Please login to add a commentAdd a comment