రాజమహేంద్రవరం రూరల్: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ(ఈపీఎఫ్‌వో) రాజమహేంద్రవరం ప్రాంతీయ కార్యాలయం పరిధిలో బుధవారం ఉదయం 9.00 గంటల నుంచి నిధి ఆప్‌కే నికత్–డిస్ట్రిక్ట్ ఔట్‌రీచ్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నట్లు ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్–2 వైడి శ్రీనివాస్ ఓప్రకటనలో తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో కోరుకొండలోని చెరుకూరి విద్యాలయం, కాకినాడ జిల్లాలో లోవలోని శ్రీతలుపులమ్మదేవాలయంలోను, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ద్రాక్షారామ పీఏసీఎస్‌లోను, ఏలూరు జిల్లాలో గుండుగొలను దగ్గర ముప్పవరంలోని నాగహనుమాన్ సాల్వెంట్ ఆయిల్స్‌లోను, పశ్చిమగోదావరి జిల్లాలో పాలకొల్లు మండలం శివదేవునిచిక్కాలలో దివెంకటస్వామినాయుడు పీఏసీఎస్‌లోను, అల్లూరి సీతారామరాజు జిల్లాలో వై.రామవరంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాల, గంగవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోను, మారేడుమిల్లులోని ఏపీట్రైబల్ వెల్ఫేర్ బాలుర స్కూల్లోను నిధి ఆప్‌కే నికత్ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. మోసాల నివారణ, విజిలెన్స్, ఇ–పాస్‌బుక్‌పై అవగాహన కల్పిస్తారన్నారు. పీఎఫ్ సభ్యులు, పింఛనుదారులు, ఎస్టాబ్లిష్మెంట్‌లు, కొత్తగా కవర్ చేసిన ఎస్టాబ్లిష్మెంట్‌లు ఈ అవుట్‌రీచ్ ప్రోగ్రామ్‌ను ఉపయోగించుకోవాలని కోరారు. డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ బకాయి ఉన్న పింఛనుదారులు, డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించడానికి ఈ క్యాంపును సందర్శించవచ్చని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment