శంభో శంకర
కార్తిక మాసం చివరి సోమవారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఊరూవాడా శివనామస్మరణ మారుమోగింది. ఆయా గ్రామాల్లోని అయ్యప్పస్వాములు, పిల్లలు, పెద్దలు, మహిళలు శివాలయాలకు వెళ్లి స్వామివారికి అభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చన చేయించుకున్నారు. తెల్లవారు జాము నుంచే సమీపంలోని పుష్కరిణుల్లో సాన్నాలు చేసి అరటి దొప్పల్లో దీపాలు వదిలారు. పురోహితులకు దీప, ఉసిరి, వస్త్ర, సాలగ్రామ, స్వయంపాక తదితర దానాలు చేశారు. సాయంత్రం మరోసారి శివయ్యను దర్శించి ఉపవాస దీక్షను విరమించారు. ఈ సందర్భంగా ఆలయాల వద్ద ప్రత్యేక దీపాలంకరణలు చేశారు. అన్నదానాలు నిర్వహించారు. బిక్కవోలు మండలం ఆరికరేవులలో 54 పార్థివ శివలింగాలను మహిళలు తలపై ఉంచుకొని ఊరేగించారు.
Comments
Please login to add a commentAdd a comment