నగదు లావాదేవీలపై ప్రత్యేక దృష్టి | Sakshi
Sakshi News home page

నగదు లావాదేవీలపై ప్రత్యేక దృష్టి

Published Tue, Apr 23 2024 8:30 AM

మాట్లాడుతున్న వ్యయ పరిశీలకురాలు నీనా నిగమ్‌. చిత్రంలో కలెక్టర్‌, ఎస్పీ   - Sakshi

ఎన్నికల ప్రత్యేక వ్యయ పరిశీలకురాలు నీనా నిగమ్‌

ఏలూరు(మెట్రో): బ్యాంకుల్లో అధిక మొత్తంలో జరిగే నగదు లావాదేవీలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రత్యేక వ్యయ పరిశీలకులు నీనా నిగమ్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం ఎన్నికల విభాగాల నోడల్‌ అధికారులు, వ్యయ పరిశీలకులతో ఆమె సమీక్షించారు. పోస్టల్‌ ఆర్డర్లు, యూపీఐ పేమెంట్లపై దృష్టి సారించాలన్నారు. మద్యం రవాణా సమయంలో సక్రమమైన సమయంలో చేరాల్సిన చోటుకు చేరిందా లేదా అన్నది పరిశీలించాలన్నారు. జిల్లాలోని అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో డిపాజిట్లు, నగదు ఉపసంహరణలపై నిఘా పెట్టాలన్నారు. సోషల్‌ మీడియాలో అభ్యర్థుల అంశాలపై కూడా దృష్టి సారించాలన్నారు. కలెక్టర్‌ వె.ప్రసన్నవ వెంకటేష్‌ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు రూ.13.54 కోట్ల విలువైన నగదు, బంగారం, మద్యం సీజ్‌ చేశామన్నారు. సీ–విజిల్‌కు సంబంధించి 329 ఫిర్యాదులు పరిష్కరించామన్నారు. 415 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించి ఎన్నికల అజ్జర్వర్లను నియమించి తొలిదశ శిక్షణ పూ ర్తిచేశామని చెప్పారు. జిల్లా ఎస్పీ డి.మేరీ ప్ర శాంతి మాట్లాడుతూ జిల్లాలో అంతర రాష్ట్ర, జిల్లాల సరిహద్దుల వద్ద 8 చెక్‌ పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. పెట్రోలింగ్‌ బృందాలు, మొబైల్‌ చెక్‌పోస్టులను నిర్వహి స్తు న్నామని చెప్పారు. డీఆర్వో డి.పుష్పమణి, అ దనపు ఎస్పీ ఎన్‌.సూర్యచంద్రరావు, జెడ్పీ సీ ఈఓ కె.సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement