చందూకు పరామర్శ
ఏలూరు (టూటౌన్): ఏలూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కె.చంద్రశేఖర్ (చందూ)ను సోమవారం రాత్రి నూజివీడు వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు పరా మర్శించారు. మూడు క్రితం బియ్యం అక్రమ వ్యాపారి, టీడీపీ నాయకుడు బుల్లినేని మధు, తన మేనల్లుడు మురళీ అనుచరులతో కలిసి చందూపై దాడి చేసి గాయపర్చారు. వారు చేసే అక్రమ వ్యాపారానికి అడ్డువస్తున్నాడన్న కక్షతో గోనెల వాగు దగ్గర దాడి చేశారు. టీడీపీ నేతలు చేసే అక్రమ బియ్యం రవాణాను ప్రశ్నిస్తున్నారన్న కారణంగా చందూపై దాడి చేశారని మాజీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు అన్నారు. దాడి చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని జిల్లా అడిషనల్ ఎస్పీని కలిసి వినతిపత్రం అందజేసినట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment