గడువులోపు అర్జీల పరిష్కారం
జిల్లా ఎస్పీ శివకిషోర్
నూజివీడు: ప్రజల నుంచి వచ్చిన అర్జీలను నిర్ణీత గడువులోపు పరిష్కరిస్తామని జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప శివకిషోర్ అన్నారు. నూజివీడు టౌన్ పోలీస్‌స్టేషన్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ప్రజల నుంచి ఆయన ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఫిర్యాదులపై పూర్తిస్థాయి విచారణ జరిపిస్తామని, చట్టపరిధిలో సమస్యలను పరిష్కరిస్తామన్నారు. మ హిళలు, ఆడపిల్లల రక్షణకు అభయ టీమ్‌లను ఏర్పాటు చేశామని, ఆపదలో ఉంటే 112 నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు. అలా గే సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930 నంబర్‌లో సంప్రదించాలన్నారు. డీఎస్పీ ప్రసాద్, సీఐలు పి.సత్యశ్రీనివాస్, కె.రామకృష్ణ పాల్గొన్నారు.
ఏలూరులో 40 ఫిర్యాదులు
ఏలూరు (టూటౌన్): ఏలూరులోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ శివకిషోర్ సుమారు 40 ఫిర్యాదులు స్వీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment