ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం
కలెక్టర్ వెట్రిసెల్వి
ఏలూరు(మెట్రో) : ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్) కార్యక్రమం ద్వారా చర్యలు చేపట్టినట్టు కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. కలెక్టరేట్‌లో సోమవారం పీజీఆర్‌ఎస్‌లో భాగంగా 245 అర్జీలను స్వీకరించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కారానికి కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ పోలీస్ కేసులకు సంబంధించి చట్టప్రకారం చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలన్నారు. అర్జీలపై నిర్లక్ష్యం తగదని, నిర్దేశిత సమయంలోపు పరిష్కారం చూపాలన్నారు.
అర్జీల్లో కొన్ని..
● దెందులూరు మండలం గాలాయిగూడేనికి చెందిన అందే సత్యనారాయణ తన భూమిని తమ్ముడు కుమారులు ఆక్రమించుకున్నారని, రీసర్వే చేయించాలని కోరారు.
● ద్వారకాతిరుమల మండలం వెంకట కృష్ణాపురానికి చెందిన ఎ.శ్రీనివాసరావు అర్జీనిస్తూ తమ భూమి రీ సర్వేలో అసైన్డ్ భూమిగా చూపారని తిరిగి సర్వే చేయించాలని అర్జీ అందజేశారు.
● ఏలూరుకు చెందిన జి.భువనేశ్వరి తన భర్త శారీరకంగా గాయపర్చగా ఆస్పత్రిలో చికిత్స పొందానని, మెడికో లీగల్ కేసు నమోదుపై చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు.
● ద్వారకాతిరుమల మండలం కొమ్మరకు చెందిన ఓ మహిళ తనను ఓ వ్యక్తి లైంగికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదు చేశారు.
సైబర్ నేరాలపై అవగాహన
సైబర్ నేరాలపై అవగాహన తప్పనిసరి అని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అపార్ నమోదు ప్రక్రియ వేగంగా పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. క్యాంపు కార్యాలయం నుంచి ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమె సమీక్షించారు. పల్లె పండుగ కార్యక్రమంలో రోడ్ల నిర్మాణం, ఉచిత ఇసుక పాలసీ అమలు, హౌస్ హోల్డ్ సర్వేపై కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులకు సూచనలిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment