ఆశావర్కర్లపై నిర్లక్ష్యం తగదు
ఏలూరు (టూటౌన్): ఆశావర్కర్ల యూనియన్‌తో చే సుకున్న ఒప్పందాలను జీఓలుగా విడుదల చే యాలని కోరుతూ ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఏలూరు కలెక్టరేట్‌లో సోమవారం ధర్నా చేశారు. జిల్లా నలుమూలల నుంచి వందలాది మంది ఆశావర్కర్లు తరలివచ్చారు. జిల్లా అధ్యక్షురాలు కమల అధ్యక్షతన జరిగిన ధర్నాలో రాష్ట్ర అధ్యక్షురాలు కె.పోశమ్మ, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్.లింగరాజు మాట్లాడుతూ గత ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాల జీఓలపై ప్రస్తుత ప్రభుత్వం సంబంధం లేదన్నట్టు వ్యవహరించడం తగదన్నారు. ఆశా వర్కర్ల వయోపరిమితి 62 ఏళ్లకు పెంపు, గ్రూప్ ఇన్సూరెన్స్ రూ.6 లక్షలు, రిటైర్మెంట్ బెనిఫిట్ రూ.60 వేలు వంటి వాగ్దానాలు అమలు చేయాలన్నారు. కూటమి పాలకులు తమకు సకాలంలో జీతాలు ఇవ్వకుండా, జీతాలు పెంచకుండా, ఒప్పందాలు అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్నారు. యూనియన్ల నాయకులు, భారీగా ఆశావర్కర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment