జంగారెడ్డిగూడెం: యువతి అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు హెచ్సీ పీసీహెచ్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన యువతి ఏలూరు డెంటల్ కాలేజీలో చదువుకుని ఇంటి వద్దే ఉంటుంది. ఈ నెల 18న స్పెషల్ కేసు ఉందని చెప్పి ఏలూరు వెళ్లిందని, అనంతరం యువతి ఫోన్ స్విచ్ఛాఫ్ అయ్యిందని ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యువతి అదృశ్యం వెనుక శ్రీనివాసపురం గ్రామానికి చెందిన సీహెచ్ దిలీప్, మరో ఇద్దరిపై అనుమానం ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్సీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment