2,800 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం
నూజివీడు: చాట్రాయిలో మంగళవారం ఎకై ్సజ్ సిబ్బంది దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 2,800 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసి, బానోతు రాజు అనే వ్యక్తిని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించినట్లు ఎకై ్సజ్ సీఐ ఏ మస్తానయ్య తెలిపారు. అలాగే దాడులు నిర్వహిస్తుండగా పారిపోయిన బాణావతు కృష్ణ, అజ్మీర శ్రీనులపై కేసు నమోదు చేశామన్నారు. దాడుల్లో ఎకై ్సజ్ ఎస్సైలు వై ఈశ్వరరావు, ఎం ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.
బయ్యన్నగూడెంలో చైన్ స్నాచింగ్
కొయ్యలగూడెం: బయ్యనగూడెంలో జరిగిన చైన్ స్నాచింగ్ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల ప్రకారం గ్రామానికి చెందిన సుంకర సత్యవతి మెయిన్ రోడ్డు లోని తన కుమారుడి షాపు నుంచి సాయంత్రం 6 గంటలకు ఇంటికి తిరిగి వెళుతుండగా ఎస్సీ పేటలోని అంబేద్కర్ విగ్రహం వద్దకు వచ్చేసరికి హెల్మెట్ పెట్టుకుని ఉన్న దుండగుడు బైక్‌పై వచ్చి ఆమె మెడలోని సుమారు నాలుగు కాసుల బంగారు తాడును లాక్కోని పారిపోయాడు. ఈ ఘటనపై సత్యవతి భర్త సోమరాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
సౌత్‌జోన్ రైఫిల్ షూటింగ్ పోటీలకు విష్ణు విద్యార్థి
భీమవరం: సౌత్‌జోన్ రైఫిల్ షూటింగ్ పోటీలకు భీమవరం విష్ణు ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థి వి ప్రదీప్‌చంద్ర ఎంపికై నట్లు కళాశాల ఫిజికల్ డైరెక్టర్ ఎం శ్రీనివాసరావు మంగళవారం విలేకరులకు తెలిపారు. విజయవాడలోని వీఆర్ సిద్ధార్ధ కళాశాలలో ఈనెల 15వ తేదీన నిర్వహించిన జేఎన్‌టీయూకే 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్ విభాగంలో ప్రదీప్‌చంద్ర ప్రతిభ కనబరిచి సౌత్‌జోన్ పోటీలకు ఎంపికయ్యాడన్నారు. డిసెంబర్‌లో పంజాబ్ రాష్ట్రంలోని ఛండీగడ్ యూనివర్సిటీలో నిర్వహించే సౌత్‌జోన్ పోటీల్లో ప్రదీప్‌చంద్ర పాల్గొంటాడన్నారు. అనంతరం క్రీడాకారుడ్ని కళాశాల ప్రిన్సిపాల్ ఎం వేణు, వైస్ ప్రిన్సిపాల్ ఎం శ్రీలక్ష్మి, శ్రీనివాసరావు తదితరులు అభినందించారు.
పాందువ్వలో చోరీ
ఉండి: ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఇంట్లో చోరీ జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై శ్రీనివాస్ తెలిపారు. వివరాల ప్రకారం ఉండి మండలం పాందువ్వ గ్రామానికి చెందిన అల్లూరి రవికుమార్ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. వర్క్ ఫ్రం హోంలో భాగంగా పాందువ్వలోని ఇంటివద్దనే ఉండి విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే పిల్లలకు పరీక్షలు ఉండడంతో ఈ నెల 15వ తేదీన కుటుంబ సమేతంగా హైదరాబాద్‌కు వెళ్లి తిరిగి 18వ తేదీ ఉదయం 7 గంటలకు ఇంటికి చేరుకున్నారు. ఇంటి తాళాలు పగులగొట్టి ఉండడంతో లోపలికి వెళ్లి చూడగా బీరువాలోని రూ.50 వేలు, రూ.45 వేల విలువైన వెండి వస్తువులు చోరీకి గురైనట్లు గుర్తించారు. బాధితుడు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment